Juices For Diabetes : చాలామంది ఈ రోజుల్లో షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. చాలామంది టైప్ 2 డయాబెటిస్ వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో షుగర్ వచ్చి బాధపడుతున్నారు. అయితే షుగర్ రాకుండా ఉండాలన్నా, షుగర్ కంట్రోల్ లో ఉండాలన్నా నాచురల్ పద్ధతుల్ని పాటించడం మంచిది.
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ లని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మధుమేహం రాకుండా ఉండవచ్చు. వేపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా వేపాకుని వాడతారు. ఖాళీ కడుపుతో వేపాకు జ్యూస్ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. కాకరకాయ జ్యూస్ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుంటుంది. ఆకలి తగ్గుతుంది. కడుపులో కీటకాలు చచ్చిపోతాయి. కాకరకాయ రసం తీసుకుంటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. కలబంద రసం కూడా బాగా ఉపయోగపడుతుంది. కలబంద రసాన్ని తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ రాకుండా ఉండాలంటే సొరకాయ రసం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో సొరకాయ రసాన్ని తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
గోధుమ గడ్డి రసం కూడా తీసుకోవచ్చు. గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఇది చాలా ఉత్తమం. దీనిలో ఉండే అమైనో యాసిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉదర సంబంధిత సమస్యలు లేకుండా కూడా చూసుకుంటాయి. పొట్ట తగ్గుతుంది. జీర్ణాశయం శుభ్రపడుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. అంతేకాకుండా షుగర్ రాకుండా ఉండాలంటే బీట్ రూట్ జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ లోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు కలిగించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. గుండెపోటు కూడా రాదు. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా కంట్రోల్ లో ఉంచగలదు బీట్ రూట్. సో చూశారు కదా ఏ జ్యూస్‌లని తీసుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది అని.. మరి ఈ జ్యూస్‌లని ఉదయం పూట తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు.