Vepa Chettu : వేప చెట్టు ద‌గ్గ‌ర ఇలా చేస్తే.. మీ జీవితం మొత్తం మారిపోతుంది..!

Vepa Chettu : ప్ర‌స్తుత కాలంలో ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ఎక్కువ‌వుతోంది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా మాన‌సిక ప్ర‌శాంత కూడా దెబ్బ తింటోంది. ఉద్యోగాలు ల‌భించ‌క‌, వ్యాపారాలు చేయ‌డానికి డ‌బ్బులు లేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో మాన‌సిక క్షోభ‌కు గుర‌య్యే వారు చాలా మందే ఉంటున్నారు. ఈ ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ప‌రిష్కారాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిని చేయ‌డానికి చాలా మంది భ‌య‌ప‌డుతూ, సందేహిస్తూ ఉంటారు. ఏ ప‌రిష్కారాన్ని చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు వ‌స్తాయో, ఏ ప‌రిష్కారాన్ని చేయ‌డం వ‌ల్ల చెడు ఫ‌లితాలు వ‌స్తాయో తెలియ‌క చాలా మంది ఏం చేయ‌కుండా అలాగే ఉండిపోతారు. ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతూ వాటి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఏ ప‌రిష్కారం చేయాలో తెలియ‌ని వారు బుధ‌వారం నాడు ఈ ప‌నిని చేయ‌డం వ‌ల్ల క‌చ్చితంగా మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ చిన్న ప‌రిష్కారాన్ని పాటించ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ క‌టాక్షాన్ని పొందడంతోపాటు స‌మ‌స్య‌ల నుండి కూడా బ‌య‌ట‌ప‌డ‌గ‌లం. ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డేసే ఆ పరిష్కారం ఏమిటి.. దానిని ఎలా పాటించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప‌రిష్కారాన్ని పాటించ‌డానికి గాను బుధ వారం నాడు సూర్యోద‌యాని కంటే ముందే నిద్ర‌లేచి త‌లస్నానం చేసి ఇంటిని, పూజ గ‌దిని శుభ్ర‌ప‌రుచుకోవాలి. త‌రువాత ఒక రాగి చెంబును తీసుకుని దానిలో రెండు చుక్క‌ల గంగా జ‌లాన్ని వేసి ఆ చెంబు నీటితో నింపి అందులో తేనె, పంచ‌దార‌, ప‌సుపు, కుంకుమ, బెల్లం వేసి మ‌న ఇష్ట దైవం ముందు ఉంచి ప్ర‌తి రోజూ పూజ చేసే విధంగానే పూజ చేసి ధూప దీప నైవేద్యాల‌ను స‌మ‌ర్పించి ఆ చెంబును తీసుకుని మ‌న‌కు ద‌గ్గ‌ర్లో ఉండే వేప చెట్టు వ‌ద్ద‌కు వెళ్లాలి.

do this pooja at Vepa Chettu see what happens
Vepa Chettu

వేప చెట్టు ద‌గ్గ‌ర‌కి వెళ్లిన త‌రువాత ముందుగా ఆ చెట్టుకు న‌మ‌స్క‌రించి మ‌న స‌మ‌స్య‌ల‌ను మ‌న‌స్సులో అనుకుంటూ మ‌నం రాగి చెంబులో తెచ్చిన నీటిని ఆ వేప చెట్టుకు స‌మ‌ర్పించాలి. ఆ నీటిని పోసిన చోట నేల‌పై కూడా ప‌సుపు, కుంకుమ‌ను వేసి ఆ మ‌ట్టిని బొట్టుగా పెట్టుకుని, కొద్దిగా మ‌ట్టిని కూడా ఇంటికి తెచ్చుకోవాలి. ఈ విధంగా ప్ర‌తి బుధ‌వారం నాడు మ‌న స‌మ‌స్య‌లు తీరే వ‌ర‌కు చేస్తూ ఉండాలి. స‌మ‌స్య‌లు తీరిన త‌రువాత కూడా ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts