వినోదం

Upasana Konidela : రామ్ చ‌ర‌ణ్ క‌న్నా ఉపాస‌న నే వ‌య‌స్సులో పెద్ద‌.. ఇద్ద‌రికీ ఎన్నేళ్ల తేడా అంటే..?

Upasana Konidela : మెగాస్టార్ చిరంజీవి న‌ట వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నాడు. ఓ వైపు న‌ట‌న ప‌రంగా తండ్రిని మించిపోగా.. సామాజిక సేవ‌లోనూ తండ్రి పేరు నిల‌బెడుతున్నాడు. త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో సైతం పాలు పంచుకుంటున్నాడు. ఈ మ‌ధ్యే చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది.

చ‌ర‌ణ్ ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. త‌రువాత మ‌గ‌ధీర సినిమాతో అంచ‌నాల‌ను దాటి వెళ్లిపోయాడు. చ‌ర‌ణ్ న‌ట‌న‌, డ్యాన్స్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక మ‌గ‌ధీర త‌రువాత చ‌ర‌ణ్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. రంగ‌స్థ‌లం మూవీతో త‌న‌లోని న‌టున్ని చ‌ర‌ణ్ ఆవిష్క‌రించాడు. ఇక ఉపాస‌న కూడా చ‌ర‌ణ్‌కు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటోంది. చ‌ర‌ణ్‌కు ఉన్న బిజినెస్‌ల‌తోపాటు అపోలో హాస్పిట‌ల్స్ బాధ్య‌త‌ల‌ను కూడా ఉపాస‌న చూస్తోంది. అలాగే సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ఉపాస‌న చురుగ్గా పాల్గొంటోంది.

do you know how much age gap is between ram charan and upasana

అయితే చ‌ర‌ణ్, ఉపాస‌న వాస్త‌వానికి చిన్న‌నాటి నుంచే స్నేహితులు. త‌రువాత ప్రేమించుకున్నారు. పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వ‌య‌స్సులో చ‌ర‌ణ్ చిన్న‌వాడు. ఉపాస‌న నే పెద్ద‌. ఆమెకు, అత‌నికి వ‌య‌స్సులో 4 ఏళ్ల తేడా ఉంది. చ‌ర‌ణ్ క‌న్నా ఉపాస‌న వ‌య‌స్సులో 4 ఏళ్లు పెద్ద కావ‌డం విశేషం. అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు క‌నుక‌.. వారి వ‌య‌స్సు తేడా చూడ‌కుండా వారి పెద్ద‌లు వారికి వివాహం జ‌రిపించారు.

ఇక చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. త‌రువాత కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌, విక్ర‌మ్ ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ల‌తో మూవీలు చేయ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాల‌పై క్లారిటీ రావ‌ల్సి ఉంది.

Admin

Recent Posts