ఆధ్యాత్మికం

శయన స్థితిలో దర్శనమిచ్చే హనుమంతుని ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా?

మనం ఏ గ్రామానికి వెళ్లినా మనకు తప్పకుండా హనుమంతుని ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఆంజనేయ స్వామి కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తూ భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తాడు. అయితే మనకు ఇప్పటి వరకు పంచముఖ ఆంజనేయుడు, భక్త ఆంజనేయుడు, వరాల ఆంజనేయుడు, వీరాంజనేయుడుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. కానీ మీరు ఎప్పుడైనా శయన స్థితిలో ఉన్న హనుమంతుని ఆలయం గురించి విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మహారాష్ట్రకు వెళితే.. మనకు శయన స్థితిలో ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ స్వామివారు ఈ విధంగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..

పురాణాల ప్రకారం సీతాపహరణ జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయ స్వామి చేసిన సహాయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే సీతాన్వేషణ కార్యక్రమంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు. అయితే లక్ష్మణుడిని బ్రతికించడం కోసం మృతసంజీవని కావాల్సి వస్తే ఆంజనేయస్వామి మృతసంజీవని కోసం ఏకంగా సంజీవని పర్వతాన్ని తీసుకువస్తాడనే విషయం మనకు తెలిసిందే.

lord hanuman will appear in sleeping position in this temple

ఈ విధంగా మృత సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చే సమయంలో హనుమంతుడు అలసిపోయి ఈ ప్రాంతంలో కాసేపు సేద తీరాడని ఆలయ పురాణం చెబుతోంది. ఈ క్రమంలోనే అది చూసిన ఓ భక్తుడు స్వామి వారి పాదాలను పట్టుకుని అక్కడి ప్రజల కష్టాలను తీర్చడం కోసం స్వామివారు ఇక్కడ కొలువై ఉండాలని అనడంతో అందుకు స్వామివారు ఆ ప్రాంతంలో భక్తులకు తాను శయన స్థితిలో భద్ర మారుతిగా దర్శనమిస్తానని చెప్పారు. ఈ విధంగా ఈ ఆలయంలోని స్వామి వారు శయన స్థితిలో భక్తులకు దర్శనమిస్తూ వారు కోరిన కోరికలను తీరుస్తున్నారు.

Admin

Recent Posts