వినోదం

Tollywood Directors : టాలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న డైరెక్ట‌ర్లు ఎవ‌రో తెలుసా..?

Tollywood Directors : ఒక‌ప్పుడు ద‌ర్శ‌కుల‌కి పెద్ద‌గా గుర్తింపు ఉండేది కాదు. కాని ఇప్పుడ‌లా కాదు, హీరోహీరోయిన్స్ క‌న్నా కూడా ద‌ర్శ‌కుల‌కే ఎక్కువ పాపులారిటీ వ‌స్తుంది. ఫలానా దర్శకుడు సినిమా తీస్తున్నారు అంటే హీరో హీరోయిన్ కన్నా ఆ దర్శకుడు పైన నమ్మకంతో సినిమాకు వెళ్లి ప్రేక్షకులు లేకపోలేదు. ఈ క్ర‌మంలోనే స్టార్ డైరెక్టర్స్ అయి ప్రస్తుతం ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న దర్శకులు కొంద‌రు ఉన్నారు. మ‌రి కొంద‌రూ రెమ్యున‌రేష‌న్ కాకుండా సినిమా బిజినెస్‌లో వాటాలు కూడా తీసుకుంటున్నార‌ట‌. ఇలా టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కలుగా ఉన్న కొంద‌రు ద‌ర్శ‌కులు ఒక్కో సినిమాకి ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటారో చూద్దాం..

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచ‌గా, ఆయ‌న ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అయ్యాడు. ఈయ‌న రెమ్యున‌రేష‌న్ లా కాకుండా బిజినెస్‌లో వాటాలు తీసుకుంటూ వ‌స్తున్నారు. సినిమా బిజినెస్‌ను బ‌ట్టి ఆ సినిమాకు రూ.100 కోట్లు తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు అని అంటున్నారు. ఇక రంగ‌స్థ‌లం సినిమా నుంచి సుకుమార్ త‌న రేటును పెంచేశాడు. ఒక్కో సినిమాకు ప్ర‌స్తుతం 20 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. పుష్ప పార్ట్ 2కు రూ.23 కోట్లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇక అల‌.. వైకుంఠ‌పురం హిట్ త‌రువాత త్రివిక్ర‌మ్ ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల‌తో పాటు బిజినెస్‌లో వాటా కూడా తీసుకుంటున్నారని టాక్.

do you know how much these directors taking as remuneration

సామాజిక స‌మస్య‌ల‌ను ట‌చ్ చేస్తూ సినిమాలు తీసే కొర‌టాల శివ ఆచార్య‌తో దారుణ‌మైన ఫ్లాప్ మూట‌గ‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి గాను ఆయ‌న 20 కోట్ల వ‌ర‌కు పారితోషికం అందుకున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల బాల‌య్య‌తో అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తీసిన బోయ‌పాటి శీను 10 నుంచి రూ.12 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట . ఇక డాషింగ్ డైరెక్ట్ పూరీ జ‌గ‌న్నాథ్ సొంత బ్యాన‌ర్‌లోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నాడు. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నాడు. క్లాసిక‌ల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ కమ్ముల ఇటీవ‌ల వ‌చ్చిన ల‌వ్‌స్టోరీ సినిమాకు రూ.10కోట్లు తీసుకున్నారు. వ‌రుస హిట్స్ తో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి ఎఫ్‌3 కోసం రూ.10 కోట్లు తీసుకున్న‌ట్టు స‌మాచారం.

Admin

Recent Posts