వినోదం

Sonu Sood : బాహుబ‌లి 2 ఆఫ‌ర్‌ను సోనూసూద్ రిజెక్ట్ చేశారా ? ఎందుకు ?

Sonu Sood : న‌టుడు సోనూసూద్ గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న క‌రోనా స‌మ‌యంలో ఎంతో మంది వ‌ల‌స కూలీల‌కు స‌హాయం చేశారు. సొంత గ్రామాల‌కు వెళ్లాల‌నుకునే వారిని ప్ర‌త్యేక బ‌స్సులు, రైళ్లు, విమానాల్లో ఈయ‌న పంపించారు. అంతేకాదు కోవిడ్ రెండో వేవ్ స‌మ‌యంలో ఈయ‌న త‌న పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక హాస్పిట‌ల్స్‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయించారు. ఇలా సోనూసూద్ చేయ‌ని స‌హాయం అంటూ లేదు. ఇప్ప‌టికీ త‌న వ‌ద్ద‌కు స‌హాయం కోసం వ‌చ్చేవారికి లేదు.. కాదు.. అన‌కుండా స‌హాయం అందిస్తూనే ఉన్నారు.

అయితే సోనూసూద్ ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లో విల‌న్ పాత్ర‌లనే చేస్తూ వ‌స్తున్నారు. హీరోగా చేసింది త‌క్కువ‌. కానీ ఆయ‌న చేసిన మంచి ప‌నుల వ‌ల్ల ప్రేక్ష‌కులు ఆయ‌న‌ను హీరోగానే చూడాల‌ని అనుకుంటున్నారు. అయితే క్యారెక్ట‌ర్ న‌చ్చితే త‌ప్ప‌క చేస్తాన‌ని సోనూ ఇది వ‌ర‌కే అన్నారు. ఇక అలాంటి సోనూసూద్ కోసం రాజ‌మౌళి స్వ‌యంగా ప్ర‌య‌త్నించారు. తాను తీసిన బాహుబ‌లి 2 సినిమాలో ఒక క్యారెక్ట‌ర్‌కు గాను ముందుగా సోనూసూద్‌నే అనుకున్నార‌ట‌. ఇందుకు రాజ‌మౌళి సోనూసూద్ వ‌ద్ద‌కు వెళ్లి అడిగార‌ట‌. అయితే సోనూ అప్పుడు ఎంతో బిజీగా ఉన్నారు. అనేక సినిమాల‌కు అప్ప‌టికే డేట్స్ ఇచ్చి ఉన్నారు. క‌నుక బాహుబ‌లి 2 చేయ‌డం సాధ్యం కాలేదు. దీంతో సోనూసూద్ రాజ‌మౌళి ఆఫ‌ర్‌ను రిజెక్ట్ చేశారు. ఫ‌లితంగా బాహుబ‌లి 2ను సోనూసూద్ మిస్ చేసుకున్నారు. అదే ఆయ‌న అందులో న‌టించి ఉంటే క‌థ మ‌రోలా ఉండేది. ఆయ‌న‌కు కూడా ఎంతో పేరు వ‌చ్చి ఉండేది.

do you know that sonu sood rejected bahubali 2 movie offer

ఇక సోనూసూద్ త‌న కెరీర్‌లో ఇలా ఎన్నో చిత్రాల‌ను మిస్ చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌కు ల‌భించిన పాత్ర‌ల‌లోనే సోనూ న‌టించారు త‌ప్ప అత్యాశ‌కు పోలేదు. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాల‌తోపాటు సేవా కార్య‌క్ర‌మాల్లోనూ బిజీగా ఉన్నారు.

Admin

Recent Posts