వినోదం

Venu Thottempudi : హీరో వేణు భార్య ఏం చేస్తుంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా..?

Venu Thottempudi : చిరునవ్వుతో, స్వయంవరం, హ‌నుమాన్ జంక్ష‌న్ లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు వేణు. ‘పెళ్ళాం ఊరెళితే’ ‘కళ్యాణ రాముడు’ ‘ఖుషి ఖుషీగా’ ‘శ్రీకృష్ణ 2006’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ వంటి చిత్రాల్లోను నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యాడు. దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా తనకు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ వస్తుందని ధీమా వ్యక్తం చేసాడు వేణు. కాని ఆ చిత్రం దారుణమైన ఫ్లాప్ కావ‌డంతో వేణు కెరీర్ సందిగ్ధంలో ప‌డింది.

ఇక వేణు ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే అత‌ని భార్య పెద్ద‌గా మ‌న‌కు ఎలాంటి ఫంక్ష‌న్స్ లో క‌నిపించదు. వేణు భార్య పేరు అనుపమ చౌదరి. వీరి రెండు కుటుంబాలకు బంధుత్వం ఉంది. కాబట్టి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అది లవ్ మ్యారేజ్ అని కూడా అనుకోవచ్చు అని వేణు అన్నాడు. ఇక ఈ దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు. వేణు భార్య అనుపమ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తి చేసిందట. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకుందట అనుపమ. ఇక వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పైనే అయ్యిందట.

do you know who is venu thottempudi wife

అనుపమ “పేజెస్ ఇన్ టైం” అనే ఒక స్క్రాప్ బుకింగ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. అంటే ఒకరికి సంబంధించిన మెమరీస్ అన్ని కలెక్ట్ చేసి ఒక స్క్రాప్ బుక్ రూపంలో ఇవ్వడం. ఇది ఒక్క స్టోర్ లో మాత్రమే కాకుండా వేరే ప్రదేశాలకి కూడా షిప్పింగ్ చేసేలా ఆమె ప్లాన్ చేశార‌ట‌. మొత్తానికి ఇద్ద‌రు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ఇటీవ‌ల వేణుని రాజ‌కీయాల‌లోకి వ‌చ్చే ఛాన్స్ ఉందా అని ప్ర‌శ్నించ‌గా, దానికి ఆస‌క్తిగానే ఉన్న‌ట్టు తెలియ‌జేశాడు.

Admin

Recent Posts