వినోదం

Akhanda Movie : అఖండ సినిమాను మిస్ చేసుకున్న న‌లుగురు హీరోయిన్స్‌.. ఎవ‌రో తెలుసా..?

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌పై ఏ రేంజ్‌లో అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాల‌య్య‌-బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో ఈ కాంబోలో అఖండ రూపొందించారు. ఈ ఈ చిత్రం కూడా అతి పెద్ద విజ‌యం సాధించింది. అఖండ ఏకంగా రూ.200 కోట్లు కొల్లగొట్టి బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. కరోనా తర్వాత ఓవరాల్‌గా టాలీవుడ్ కే ఒక సెన్సేషనల్ క‌మ్‌బ్యాక్ సినిమాగా నిలిచింది. అఖండ డైరెక్ట్ గా నాలుగు థియేటర్లలో వంద రోజులు ఆడడంతో పాటు చిల‌కలూరిపేటలో డైరెక్ట్ గా 4 ఆటలతో ఏకంగా 175 రోజులపాటు ఆడింది.

అఖండ ప్ర‌భంజ‌నం వెండితెరపైనే కాక బుల్లితెర‌పై కూడా చూపించింది. ఓటీటీలో కూడా దుమ్ము రేపే రీతిలో అద‌ర గొట్టేసింది. సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) లో అఖండ గర్జించింది. విమ‌ర్శ‌కుల నుంచి బాల‌య్య‌కు బెస్ట్ ఉత్త‌మ న‌టుడు అవార్డు వ‌చ్చింది. అలాగే బెస్ట్ ఫీమేల్ సింగ‌ర్‌గా జై బాల‌య్య సాంగ్‌కు గీతా మాధురికి అవార్డు వ‌చ్చింది. ఇక ఈ సినిమాలో అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో అద‌ర‌గొట్టేసిన సినిమాటోగ్రాఫ‌ర్ రాంప్ర‌సాద్‌కు ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ అవార్డు వ‌చ్చింది. ఈ ర‌కంగా సైమాలో కూడా అఖండ స‌త్తా చాటాడు.

do  you know who missed to act in akhanda movie

అఖండ సినిమా ఫ‌స్ట్ హాఫ్ లో బాల‌య్య ముర‌ళీకృష్ణ పాత్ర‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఉండ‌గా.. సెకండ్ హాఫ్ లో అఖండ పాత్ర‌కు ప్రాధాన్యం ఇచ్చారు బోయ‌పాటి. అఘోర పాత్ర‌లో బాల‌య్య‌ అద్భుతంగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారు. ఈ సినిమా కోసం న‌లుగురు హీరోయిన్స్‌ని బోయ‌పాటి సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది. తొలుత కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఆ త‌రువాత ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, కేథ‌రిన్‌, పాయ‌ల్ రాజ్ పూత్ వంటి హీరోయిన్ల‌ను బోయ‌పాటి సంప్ర‌దించార‌ట‌. కానీ ఈ న‌లుగురు హీరోయిన్లు రిజెక్ట్ చేయ‌డంతో బాల‌య్య‌తో న‌టించే ఛాన్స్ ను ప్ర‌గ్యాజైస్వాల్ ద‌క్కించుకుంది. ప్ర‌గ్యా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని బాగానే ఉప‌యోగించుకుంది.

Admin

Recent Posts