వినోదం

Arya Movie : ఆర్య సినిమాను వ‌దులుకున్న స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

Arya Movie : చిత్ర పరిశ్రమలో నటీనటులకు మంచి గుర్తింపు రావాలంటే వాళ్ళ జీవితాన్ని సక్సెస్ వైపు మలుపు తిప్పే అవకాశం వాళ్లకు ఒక సినిమా ద్వారా వస్తుంది. ఆ ఒక సినిమానే వాళ్లకు స్టార్ స్టేటస్ ను సంపాదించి పెడుతుంది. ఒక హీరోని స్టార్ గా నిలబెట్టిన ఆ సినిమా వెనుక ఎన్నో ట్విస్టులు ఉంటాయి. ప్రతి హీరో కూడా సినిమా కథలను ఎంచుకోవడంలో ఎన్నో జాగ్రత్తలు వహించాలి. వారు ఎంచుకున్న కథే వాళ్లకు సరైన సక్సెస్ ను అందించి హిట్ ట్రాక్ లోకి వస్తారు.

ఇలా ఒక చిత్రంతో హీరోలను స్టార్ హీరో ల లిస్ట్ లో చేర్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ సంపాదించిన చిత్రం ఆర్య. వన్ సైడ్ ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్య చిత్రం అల్లు అర్జున్ కి యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఈ ఆర్య చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు.

అల్లు అర్జున్ ఆర్య చిత్రం కన్నా ముందు ఎన్ని చిత్రాలు రిజెక్ట్ చేసారో తెలిస్తే క‌చ్చితంగా షాక్ అవుతారు. అల్లు అర్జున్ ఆర్య సినిమాకు ముందు 96 కథలను రిజెక్ట్ చేశారట. ఆర్య సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వక ముందు మ్యాథ్స్ టీచర్ గా పని చేసేవారు. ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ క్రమంలోనే దిల్ సినిమా చేసే సమయంలో సుకుమార్ లో డైరెక్టర్ కావాలన్న పట్టుదల చూసి నిర్మాత దిల్ రాజు ఆయన నిర్మాణ సారథ్యం వహించిన చిత్రం దిల్ సినిమా సూపర్ హిట్ అయితే నీకు ఆఫర్ ఇస్తాను కథను రెడీ చేసుకో అని చెప్పారట.

do you know who rejected arya movie

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలోనే సుకుమార్ ఆర్య కథను రాసుకున్నారు. ఇక దిల్ సినిమా అనుకున్న విధంగా సూపర్ హిట్ అవ్వడంతో దిల్ రాజు సుకుమార్ ను ఆఫీస్ కు పిలిచి కథ విన్నారట. అయితే ఈ కథకు ముందుగా అప్పటికి సక్సెస్ ఫామ్ లో ఉన్న నితిన్, ప్రభాస్, రవితేజలను సంప్రదించారు. కానీ వాళ్ళు నో చెప్పడంతో ఈ సినిమాకు ఎవరైనా కొత్త హీరో అయితే బాగుంటుందని సుకుమార్ భావించారట. ఇక అప్పటికే గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అయితే ఈ కథకు కరెక్ట్ గా సరిపోతాడు అని కుమార్ భావించారట.

ఆ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ ని సంప్రదించి కథ వినిపించడంతో ఇప్పటివరకూ 96 కథలు విన్నాను. అన్నీ రొటీన్ కథలా ఉన్నాయి. ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది అని బన్నీ వేంటనే ఓకే చెప్పేశాడట. బన్నీకి ఆర్య కథ నచ్చడంతో అల్లు అరవింద్ కు కూడా ఈ కథను వినిపించడం జరిగింది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత హీరో అల్లు అర్జున్ కి, డైరెక్టర్ సుకుమార్ కి ఇండస్ట్రీలో క్రేజ్ బాగా పెరిగింది.

Admin

Recent Posts