Folding Chapati : మనం గోధుమపిండితో చపాతీలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో చపాతీలు మనకు సహాయపడతాయి. అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంలో, అలాగే రాత్రి డిన్నర్ లో కూడా వీటిని తింటూ ఉంటాము. అయితే సాధారణంగా మనం చేసే చపాతీలు వేడి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి. ఇవి చల్లారే కొద్ది గట్టిగా అయిపోతూ ఉంటాయి. గట్టిగా అయిన చపాతీలను తినడం కష్టమనే చెప్పాలి. అయితే కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చపాతీలు చేసిన చాలా సమయం వరకు కూడా మెత్తగానే ఉంటాయి. రుచిగా, మెత్తగా చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోల్డింగ్ చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు.
ఫోల్డింగ్ చపాతీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత దీనిపై నెయ్యి వేసి చపాతీ అంతా రుద్దుకోవాలి. తరువాత దీనిపై గోధుమపిండిని చల్లుకోవాలి. ఇప్పుడు చపాతీని మధ్యలో నుండి చివరి నుండి వరకు కత్తితో కట్ చేసుకోవాలి. తరువాత కట్ చేసిన దగ్గర నుండి చపాతీని రోల్ చేసుకుని మరలా ఉండలా చుట్టుకోవాలి. ఇప్పుడు మరలా పొడి పిండి చల్లుకుంటూ చపాతీని వత్తుకోవాలి. తరువాత వేడి వేడి పెనం మీద వేసి పెద్ద మంటపై కాల్చుకోవాలి. నూనె వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు చల్లారిన తరువాత కూడా మెత్తగా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల చపాతీలు చాలాసమయం వరకు మెత్తగా ఉంటాయి.