Calcium Laddu : ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే చాలు మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లడ్డూలను పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. ఈ లడ్డూలను తినడం వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. క్యాల్షియం లోపంతో బాధపడే వారు ఈ లడ్డూలను తినడం వల్ల క్యాల్షియం లోపం తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుంది. అలాగే ఈ లడ్డూలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.
పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అంతేకాకుండా అ లడ్డూలను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. స్త్రీలు ఈ లడ్డూలను తినడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. కేవలం రెండంటే రెండు పదార్థాలను ఉపయోగించి మనం ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. క్యాల్షియం లోపాన్ని నివారించే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి గానూ మనం నువ్వులను, ఖర్జూరాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటితో లడ్డూలను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక కళాయిలో ఒక కప్పు నువ్వులను వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒకటిన్నర కప్పు ఖర్జూర పండ్లను తీసుకుని వాటిలో ఉండే గింజలను తీసేసి ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఈ ఖర్జూర పండ్ల మిశ్రమాన్ని నువ్వులల్లో వేసి అంతా కలిసేలా కలుపుకుని లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను ఫ్రిజ్ లో ఉంచి 15 రోజుల పాటు తినవచ్చు. ఈ విధంగా నువ్వుల లడ్డూలను తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభించడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.