lifestyle

Tips For Removing Lizards : ఈ చిట్కాను పాటిస్తే చాలు.. రెండే రెండు నిమిషాల్లో ఇంట్లోని బ‌ల్లుల‌ను త‌ర‌మ‌వ‌చ్చు..!

Tips For Removing Lizards : చాలా మంది, ఇళ్లల్లో బల్లులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బల్లుల సమస్య నుండి బయటపడడానికి, చూస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా బల్లులు ఎక్కువగా ఉన్నాయా..? ఆ బల్లులని తరిమి కొట్టాలని చూస్తున్నారా..? ఇలా చేస్తే ఈజీగా బల్లుల బెడద నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కాని ఫాలో అయితే, ఈజీగా ఇంట్లో నుండి బల్లులు వెళ్లిపోతాయి. బల్లులను చంపకూడదు అంటారు. కాబట్టి, వాటిని చంపకుండా ఇంటి నుండి ఈజీగా తరిమేయండి.

కొంతమంది కోడిగుడ్డు పెంకులని ఇంట్లో అక్కడక్కడా పెడుతుంటారు. అలా చేస్తే బల్లులు వెళ్లిపోతాయని భావిస్తారు. కానీ ఉపయోగం ఏమీ కూడా పెద్దగా లేదు. కోడిగుడ్డు చిప్పల్ని ఇంట్లో అక్కడక్కడ పెడితే బల్లులు రావు అన్నది వాస్తవమే. అయితే, ఇది కేవలం రెండు రోజులు మాత్రమే. దీనిలో తేమ రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ రెండు రోజులు కూడా వాసనకి బల్లులు ఆ ప్రదేశంలోకి రావు. ఆ తర్వాత బల్లులు వస్తూ ఉంటాయి.

follow these tips to get rid of lizards

నాలుగు వెల్లుల్లిపాయలతో బల్లుల బాధ నుండి బయట పడవచ్చు. దీన్ని ఇంట్లో పెడితే బల్లులు ఈజీగా వెళ్ళిపోతాయి. ఉల్లిపాయల్ని తొక్క తీసేసి, ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పలుచగా అయ్యేలా ఇంకా కొద్దిగా నీళ్లు పోసి, మొత్తంగా బాగా కలుపుకోవాలి.

ఇలా కలుపుకున్న ఆ వెల్లుల్లి రసాన్ని, ఒక స్ప్రే బాటిల్ లో వేసి స్ప్రే చేయాలి. ఈ ప్రభావం ఒక నెల రోజులు పాటు ఉంటుంది. ఈజీగా బల్లులు ఇంట్లో నుండి వెళ్లిపోతాయి. ఇంటి నుండి బల్లులు బయటకెళ్ళి పోవడానికి, ఇది మంచి చిట్కా. కావాలంటే, ఈసారి ఈ చిట్కా ని ట్రై చేయండి బల్లుల సమస్య ఉండదు.

Admin

Recent Posts