ఆధ్యాత్మికం

ఏ దేవునికి ఏ పుష్పాలతో పూజిస్తే ఫలితం ఉంటుందో తెలుసా?

సాధారణంగా మనం ప్రతి రోజూ దేవుడికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తాం. కేవలం ఇంటిలో మాత్రమే కాకుండా దేవాలయాలలో కూడా స్వామివారికి పెద్ద ఎత్తున పూలను సమర్పించి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఏ దేవుడికి ఏ విధమైన పువ్వులతో పూజించడం వల్ల శుభం కలుగుతుంది ? ఏ దేవుడికి ఏ పుష్పాలు అంటే ఇష్టమో.. ఇక్కడ తెలుసుకుందాం..

వినాయకుడికి, సూర్యభగవానుడికి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం పొందగలం. అదేవిధంగా విష్ణు భగవానుడిని తులసీదళాలతో, మహాలక్ష్మిని తామర పువ్వులతో పూజించాలి. గాయత్రీ దేవిని పూజించేటప్పుడు మల్లిక, పొగడ, కుశమంజరి, మందార, మాధవి, జిల్లేడు వంటి పుష్పాలతో పూజ చేయడం ఎంతో శుభసూచకం.

for which god we have to do pooja with which flowers

శ్రీ చక్రాన్ని పూజించేటప్పుడు తప్పకుండా తులసీదళాలు ఉండాలి. అదేవిధంగా ఎర్రటి గన్నేరు, కలువ పువ్వులు, జాజి, మల్లెపువ్వులతో శ్రీచక్రాన్ని పూజించడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఇక ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలంటే తప్పకుండా మారేడు దళాలతో పూజించాలి. స్వామి వారికి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయటం వల్ల స్వామి వారి అనుగ్రహం పొందగలం. ఈ విధంగా దేవుడికి పూజ చేసేటప్పుడు ఆయా పుష్పాలతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయి.

Admin

Recent Posts