ఆధ్యాత్మికం

Touching Elders Feet : పెద్ద‌వాళ్ల పాదాల‌కు న‌మస్కారం చేయ‌డం వెనుక ఉన్న కార‌ణాలు ఇవే..!

Touching Elders Feet : మన తల్లిదండ్రులు లేదంటే పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయాలని చెప్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల నుండి కూడా ఈ ఆచారం ఉంది. దీనిని మనం పాటిస్తున్నాం. ఇంటికి వచ్చిన బంధువులకి, అమ్మమ్మ, తాతయ్యలకి, తల్లిదండ్రులకి నమస్కారం పెడుతూ ఉంటాం. పుట్టినరోజు లేదంటే ఏదైనా వేడుకలు వంటివి జరిగినా కూడా పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటాం. అయితే ఎందుకు పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి..? దానివల్ల ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వేదాల నుండి కూడా ఈ సాంప్రదాయం ఉంది. వేదాల్లో ఈ పద్ధతిని చరణ‌ స్పర్శ అని పిలిచేవారు. పూర్వకాలంలో తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని, ఉపాధ్యాయులని పలకరించడానికి ముందు పాదాలకు నమస్కారం చేసుకోవాల‌ని పిల్లలకు నేర్పించే వాళ్ళు. ఒకప్పుడు అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే పెద్దల పాదాలకి నమస్కారం చేసేవారు. రాత్రి నిద్ర పోయే ముందు తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసేవాళ్లు.

Touching Elders Feet what is the reason behind it

ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్లే ముందు కూడా పెద్ద వాళ్ల పాదాలకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత వెళ్లేవారట. ఇలా ఆశీర్వాదం తీసుకుని వెళ్లడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఈ రోజుల్లో మాత్రం అలా కాదు. ఈ ఆచారం రాను రాను మారిపోయింది. పెద్ద వాళ్ళ పాదాలకి నమస్కరించడం ముఖ్యమైన సంప్రదాయమని మహాభారతం అధర్వణ వేదంలో వివరించడం జరిగింది.

అయితే ఇలా నమస్కారం చేయడం వలన శక్తివంతంగా ఉంటుందట. అలాగే గొప్ప అనుభూతి ఉంటుందట. మానవ శరీరంలో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయి. పెద్ద వాళ్ళ పాదాలని తాకడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పెద్దవాళ్ళు తలపై చేయి పెట్టి ఎప్పుడు ఆశీర్వదిస్తారో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది. ఇలా నమస్కారం చేయడం అనేది వ్యాయామంగా కూడా ఉంటుంది. శరీరాన్ని వంచడం వలన వెన్నెముక వంగి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుక‌నే అలా న‌మ‌స్కారం చేస్తుంటారు.

Admin

Recent Posts