Garika Gaddi : గరిక.. ఇది తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. పొలాల గటంల మీద, చేలల్లో, మన ఇంటి.. ఇలా ఎక్కడపడితే అక్కడ గరిక పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా గరికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వినాయకుడికి గరికతో పూటజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని మనలో చాలా మంది భావిస్తారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఔషధంగా కూగా గరిక మనకు ఎంతో మేలు చేస్తుంది. గరికలో నల్ల గరిక, తెల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి. అలాగే పొడవుగా పెరిగేది. తీగలా పాకేదిఅని రెండు రకాలు ఉంటాయి. అయితే నల్ల గరిక కంటే తెల్ల గరిక మనకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గరికను సంస్కృతంలో దూర్వా, శతవీర్య అని హిందీలో దూర్వా, దూబ్ అని పిలుస్తారు. గరికను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
గాయాల నుండి రక్తం కారుతూ ఉంటే పచ్చి గరిక గడ్డిని, ఉత్తరేణి ఆకులను, చిన్న యాలకులను సమానంగా కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని గాయాలపై రాసిన వెంటనే గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది. చర్మ రోగాలను తగ్గించే గుణం కూడా గరికకు ఉంది. గరకి గడ్డిని, పసుపును కలిపి మెత్తగా నూరాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై లేపనంగా రాసుకోవడం వల్ల దురదలు, దద్దుర్లు, గజ్జి వంటి చర్మ రోగాలు తగ్గుతాయి. అదే విధంగా గరిక తైలాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల అన్ని రకాల చెవి సమస్యలను తగ్గించుకోవచ్చు. తెల్ల గరిక సమూల రసం 80 గ్రా., నువ్వుల నూనె 60 గ్రా., ముల్లంగి రసం 60 గ్రా., సైంధవ లవణం 10 గ్రాముల మోతాదులో కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నూనె మిగిలే వరకు మరిగించి నిల్వ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న నూనెను నాలుగు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవిలో హోరు. చీము నుండి చీము కారడం, చెవుడు వంటి సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే గుణం కూడా గరికకు ఉంది. మంచి ప్రదేశంలో పెరిగిన గరికను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత దానిని దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని రెండు పూటలా మూడు టీ స్పూన్ల మోతాదులో తాగుతూ ఉంటే 20 రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. అలాగే బహిష్టు ఆగిన స్త్రీలు గరిక వేర్లను దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 5 గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆగిన బహిష్టు మరలా వస్తుంది. అలాగే గరిక వేర్లను దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 5 నుండి 6 చుక్కల మోతాదులో రెండు ముక్కుల్లో వేయడం వల్ల ముక్కు నుండి రక్తం కారడం ఆగుతుంది. ఈ విధంగా గరిక మనకు ఎంతో సహాయపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.