Chedalu : మీ ఇంట్లో చెద‌లు ప‌డుతున్నాయా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Chedalu : మ‌నం అప్పుడ‌ప్పుడూ చెట్ల‌కు చెద‌లు ప‌ట్ట‌డాన్ని చూస్తూనే ఉంటాం. అలాగే మ‌న ఇంట్లో ఉండే చెక్క వ‌స్తువులు, పుస్త‌కాల‌కు కూడా చెద‌లు ప‌డుతుంటాయి. ఈ చెద‌లను మ‌నం నిర్ల‌క్ష్యం చేస్తే గ‌న‌క మ‌న ఇంటికే న‌ష్టం వ‌స్తుంది. ఈ చెద‌లు మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో, మ‌న అల్మారాల‌కు, పుస్త‌కాల‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప‌డుతుంది. ఈ చెద పురుగులు ప‌ట‌ట్డం వ‌ల్ల మ‌న ఇంటికే కాదు మ‌న‌కు ఎంతో న‌ష్టం క‌లుగుతుంద‌ని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చెద పురుగులు ప‌ట్ట‌డం వ‌ల్ల మాన‌సిక బాధ‌లు, భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం, క‌టుంబంలో శాంతి లేక‌పోవ‌డం, ఆర్థిక బాధ‌లు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

ఇలా చెద‌లు ప‌ట్టిన వెంట‌నే ఆ వ‌స్తువును లేదా ఆ ప్ర‌దేశాన్ని వెంట‌నే శుభ్రం చేయాలి. చెద పురుగులను నివారించే మందును కానీ, కిరోసిన్ కానీ ఉప‌యోగించి ముందుగా అంతా శుభ్రం చేయాలి. చెద‌లు ప్రారంభమైన స్థానాన్ని గుర్తించి అక్క‌డి నుండి దానిని స‌మూలంగా నాశ‌నం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్లే మ‌న‌కు అదృష్టం క‌లుగుతుంది. మ‌న ఇంట్లో ఉండే ద‌రిద్రం అంతా బ‌య‌ట‌కు పోతుంది. చెద పురుగులు ప‌ట్ట‌డం ద‌రిద్రానికి సంకేత‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంటికి చెద ప‌ట్టిందంటే మ‌న‌కు దరిద్రం ప‌ట్టిన‌ట్టేన‌ని చెద ప‌ట్టిన వెంట‌నే దానిని స‌మూలంగా నాశ‌నం చేయాల‌ని వారు చెబుతున్నారు.

have you seeing Chedalu in your home know what happens
Chedalu

మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో, ఇంట్లో ఎక్క‌డ చెదలు ప‌ట్టినా ఇల్లు అంతా అది వ్యాపిస్తుంది. ఇలా చెదలు ప‌ట్ట‌డం వ‌ల్ల మ‌న ఇంట్లో ఉండే వ‌స్తువులు పాడ‌వ‌డంతోపాటు మ‌న ఇంట్లోని వారి బాధ‌ల‌కు కార‌ణ‌మ‌వుతాయి. మ‌న ఇంటి చుట్టూ, ఇంట్లో చెద‌లు ప‌ట్ట‌కుండా మందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా చెదలు ప‌డితే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే వాటిని నిర్మూలించాలి. ఇలా చేయ‌డం వల్ల మ‌న ఇంట్లోని వారు ఆర్థికంగా, మానసికంగా పుంజుకుంటారు. క‌నుక చెద‌లు ప‌ట్టిన వెంట‌నే వాటిని స‌మూలంగా నివారించాల‌ని, అప్పుడే మ‌న‌కు ప‌ట్టిన ద‌రిద్రం పోయి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts