వినోదం

Rakshitha : ఇడియ‌ట్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి.. ఇప్పుడు ఎక్క‌డ ఉంది..?

Rakshitha : ర‌వితేజ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం ఇడియ‌ట్. ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది ర‌క్షిత‌. చిత్రంలో రక్షిత ఎంతో నాజూకుగా, క్యూట్ క్యూట్ అందంతో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది.ఈ సినిమాతో ర‌క్షిత‌కి ఫుల్ పాపులారిటీ ద‌క్క‌గా, ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. వెంటనే మహేష్ తో ‘నిజం’ అనే సినిమాలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా అగ్ర హీరోగాలైన.. నాగార్జునతో ‘శివమణి’, ఎన్టీఆర్ తో ‘ఆంధ్రావాలా’, చిరంజీవి తో ‘అందరివాడు’ వంటి చిత్రాలు చేసే అవకాశాలు దక్కించుకుంది.

ర‌క్షిత ఒక‌ప్పుడు ఓ ఊపు ఊపేసిన తరువాత ఆఫర్లు పెద్దగా రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసి అక్కడ కొన్ని చిత్రాలు చేసింది. అనంత‌రం 2007 లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకుని సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్పింది. అయితే క‌న్నడ టీవీ షోల‌లో అప్పుడ‌ప్పుడు జ‌డ్జిగా కూడా క‌నిపించి సంద‌డి చేసింది. అయితే ప్ర‌స్తుతం ర‌క్షిత లుక్స్ అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తున్నాయి. ఒక‌ప్పుడు చాలా అందంగా క‌నిపించిన ర‌క్షిత ఇప్పుడు ఇంత బొద్దుగా క‌నిపించే స‌రికి అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

have you seen rakshitha how is she now

అసలు ఈమె ‘ఇడియట్’ హీరోయినా…? అని షాకయ్యేలా ఉంది ఈమె లుక్. అంతలా ఈమె మొహం కూడా మారిపోయింది. అయితే ఆమె అలా బరువు పెరగడానికి గల కారణం తన కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ వలన అంటూ రక్షిత ఓ సందర్భంలో ప్రేక్షకులకు తెలిపారు. ప్రస్తుతం రక్షిత భారీ ఆకారంతో ఉండ‌గా, ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటొలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఈమె అసలు పేరు శ్వేత. రక్షిత జన్మించింది బెంగళూరులో. ఇక ఈమె తండ్రి బిసి గౌరీశంకర్ కొరియోగ్రాఫర్. ఈమె తల్లి కూడా మమతా రావు కన్నడ నటి. ఇక వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో ఉండడంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా సులువుగా అయ్యింది.

Admin

Recent Posts