lifestyle

ఓం అనే మంత్రాన్ని రోజూ ప‌ఠించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

ఓం అనే మంత్రం.. పవిత్ర‌త‌కు చిహ్నం. ఆ మంత్రాన్ని దైవ స్వ‌రూపంగా భావిస్తారు. హిందువులు ఆ మంత్రాన్ని ప్ర‌ణ‌వ మంత్రంగా భావించి ప‌ఠిస్తారు. అయితే ఈ మంత్రాన్ని రోజూ ప‌ఠించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఓం మంత్రాన్ని రోజూ ప‌ఠించ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. మాన‌సిక వ్యాధులు.. ముఖ్యంగా డిప్రెష‌న్ ఉన్న‌వారు రోజూ ఈ మంత్రాన్ని ప‌ఠించ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట పడ‌వ‌చ్చు.

* ఏకాగ్ర‌త పెరగాల‌నుకునే వారు ఈ మంత్రాన్ని ప‌ఠించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు.

health benefits of chanting om mantra daily

* ఓం మంత్రాన్ని ప‌ఠించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే చ‌క్రాలు ఉత్తేజం అవుతాయి. మ‌న శ‌రీరంలోని శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి.

* ఓం మంత్రాన్ని ప‌ఠించ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నెగెటివ్ దృక్ప‌థం పోతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

* ఈ మంత్రాన్ని ప‌ఠిస్తే వెన్నెముక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వెన్నెముక దృఢంగా మారుతుంది. భావోద్వేగాలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ప‌రిస‌రాల ప‌ట్ల ఉండే అప్ర‌మ‌త్త‌త పెరుగుతుంది. నిద్ర బాగా ప‌డుతుంది.

Admin

Recent Posts