Healthy Laddu : ఈ ల‌డ్డూల‌ను రోజుకు 2 తింటే చాలు.. ఎలాంటి రోగాలు ఉండ‌వు.. శ‌రీరం దృఢంగా మారుతుంది..

Healthy Laddu : రోజుకు ఒక్క ల‌డ్డూ తింటే చాలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అదేవిధంగా చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి ముఖాన్ని అందంగా కాంతింవంతంగా త‌యారు చేస్తుంది. జుట్టు రాల‌డాన్ని తగ్గిస్తుంది. ఈ ల‌డ్డూను పిల్ల‌లకు కూడా ఇవ్వ‌వచ్చు. దీనిని పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు జ్ఞాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంది. ఈ ల‌డ్డూను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అల్జీమ‌ర్స్ వంటి స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. శ‌రీరానికి త‌గినంత శక్తి ల‌భించి రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ల‌డ్డూను ఎలా త‌యారు చేసుకోవాలి… దీనిని ఎలా తీసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ల‌డ్డూను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మనం 250 గ్రాముల ఖ‌ర్జూరాల‌ను, 100 గ్రాముల జీడిప‌ప్పును, 100 గ్రాముల బాదంప‌ప్పును, 250 గ్రాముల న‌ల్ల ఎండు ద్రాక్ష‌ల‌ను, 200 గ్రాముల వాల్ న‌ట్స్ ను, 50 గ్రాముల అంజీరాను, 50 గ్రాముల గోంధ్ ను, 250 గ్రాముల ఫూల్ మ‌ఖ‌నీని, 250 గ్రాములు ఎండు కొబ్బ‌రి పొడిని, 4 లేదా 5 యాల‌కుల‌ను, అర క‌ప్పు ఆవు నెయ్యిని లేదా గేదె నెయ్యిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక క‌ళాయిలో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక గోంధ్ ను వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఫూల్ మ‌ఖ‌నాను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే మ‌ర‌లా నెయ్యిని వేసి జీడిప‌ప్పు, బాదంప‌ప్పును, వాల్ న‌ట్స్ ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే అంజీరాను ముక్క‌లుగా చేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.

Healthy Laddu take daily two get these amazing benefits
Healthy Laddu

త‌రువాత ఎండు ద్రాక్ష‌ను, యాల‌కుల‌ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. చివ‌ర‌గా కొబ్బరి పొడిని వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి త‌ప్ప మిగిలిన ప‌దార్థాలన్నింటిని ఒక జార్ లోకి తీసుకుని మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా ప‌లుకులు ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నెయ్యి వేసి అది వేడ‌య్యాక ఖ‌ర్జూరాల‌ను మెత్త‌గా చేసి వేసుకుని వేయించాలి. ఇది వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మాన్ని వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఎండు కొబ్బరి పొడిని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మ‌మంతా గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కావ‌ల్సిన ప‌రిమాణంలో మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ల‌డ్డూలుగా చేసుకోవాలి.

ఈ ల‌డ్డూల‌ను గాలి, త‌డి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇలా త‌యారు చేసుకున్న ల‌డ్డూల‌ను రోజుకు 2 చొప్పున తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఇందులో జీడిప‌ప్పును ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఈ ల‌డ్డూల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ ల‌భిస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌య్యి కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. నోటి దుర్వాస‌న, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts