Lizards : మీ ఇంట్లో ఉండే బ‌ల్లులు రెండే రెండు నిమిషాల్లో పారిపోవాలంటే.. ఇలా చేయండి..!

Lizards : మ‌న ఇళ్ల‌ల్లో బ‌ల్లులు ఉండ‌డం స‌హ‌జ‌మే. ఇళ్ల‌ల్లోకి వ‌చ్చే పురుగుల‌ను, కీట‌కాల‌ను తింటూ ఇవి జీవ‌నం సాగిస్తూ ఉంటాయి. బ‌ల్లుల‌ను చూస్తేనే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. అస‌హ్యించుకుంటారు. వాటి రూప‌మే భ‌యంక‌రంగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇంట్లో నుండి త‌రిమి వేయ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. బ‌ల్లుల‌ను త‌రిమి వేసే స్ప్రేల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. కానీ ఈ స్ప్రేల వ‌ల్ల దుష్ప్ర‌భావాలు క‌లిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా కొన్ని ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా బ‌ల్లుల‌ను త‌రిమి వేయ‌వ‌చ్చు. బల్లుల‌ను త‌రిమి వేసే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మ‌నం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

దుమ్ము, బూజు, ధూళి లేకుండా ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో మూల‌ల‌ను, అట‌క‌ల మీద శుభ్ర‌ప‌రుస్తూ ఉండాలి. ఇంట్లో చెత్త‌ను, ప‌నికిరాని వ‌స్తువుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌డేస్తూ ఉండాలి. ఇంట్లో శుభ్రంగా అలాగే చ‌ల్ల‌గా ఉండేలా చూసుకోవాలి. బ‌ల్లుల‌కు వేడి ప్ర‌దేశం అంటే చాలా ఇష్టం. క‌నుక ఇంట్లో ఎప్పుడూ చ‌ల్ల‌గా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో చ‌ల్ల‌గా ఉంటే బ‌ల్లులు ఎక్కువ‌గా ఉండ‌వు. ఇంట్లో నుండి బ‌ల్లులు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోవాలంటే ఒక స్ప్రే బాటిల్ చ‌ల్ల‌టి నీటిని తీసుకుని బ‌ల్లులు ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశంలో స్ప్రే చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌ల్లులు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోతాయి. అలాగే ఇంట్లో ఉండే ఏసీ ఆన్ చేయ‌డం వ‌ల్ల ఇంట్లో చ‌ల్ల‌గా మారుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా బ‌ల్లులు బ‌య‌ట‌కు పోతాయి. అదే విధంగా బ‌ల్లుల‌కు వెల్లుల్లి వాస‌న న‌చ్చ‌దు. క‌నుక ఒక స్ప్రే బాటిల్ లో కొద్దిగా నీటిని తీసుకోవాలి.

home remedies for Lizards follow these
Lizards

త‌రువాత ఇందులో వెల్లుల్లి ర‌సాన్ని వేసి బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ఇంటి మూల‌ల్లో, గోడ‌ల‌పై అలాగే బ‌ల్లులు ఎక్కువ‌గా ఉండే ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా బ‌ల్లులు పారిపోతాయి. అలాగే క‌ర్పూరం బిళ్లల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం బ‌ల్లుల‌ను త‌రిమి వేయ‌వ‌చ్చు. ఇంట్లో అక్క‌డ‌క్క‌డ మ‌నం క‌ర్పూరం బిళ్ల‌ల‌ను ఉంచ‌డం వ‌ల్ల కూడా బ‌ల్లులు పారిపోతాయి. అలాగే బ‌ల్లుల‌కు కోడిగుడ్డు వాస‌న కూడా అస్స‌లు న‌చ్చ‌దు. ఇంట్లో మూల‌ల‌కు, త‌లుపుల ద‌గ్గ‌ర కోడిగుడ్డు పెంకుల‌ను ఉంచాలి. కోడిగుడ్డు ప‌చ్చి వాస‌న పోగానే ఆ పెంకుల‌ను మారుస్తూ ఉంచాలి. అలాగే బ‌ల్లులు తిరిగే ప్ర‌దేశంలో నెమ‌లి ఈక‌ల‌ను వేలాడ‌దీయాలి. అవి గాలికి అటూ ఇటూ ఊగేలా చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌ల్లులు పారిపోతాయి. ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు చాలా సహ‌జ సిద్దంగా మ‌నం బ‌ల్లుల‌ను ఇంట్లో నుండి త‌రిమి వేయ‌వ‌చ్చు.

D

Recent Posts