Mutton : మ‌ట‌న్‌ను చాలా త్వ‌ర‌గా, మెత్త‌గా ఎలా ఉడికించుకోవాలో తెలుసా..?

Mutton : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది మ‌ట‌న్‌, చికెన్ వంటి మాంసాహారాల‌ను తింటుంటారు. అయితే చికెన్ క‌న్నా మ‌ట‌న్ రుచి అమోఘంగా ఉంటుంది. క‌నుక వారం వారం మ‌ట‌న్ తినేవారు కూడా ఉంటారు. అయితే కొంద‌రు మ‌ట‌న్ ను ఎంత ఉడ‌క‌బెట్టినా ముక్క‌ల‌ను కొరికితే మాత్రం గ‌ట్టిగానే ఉంటాయి. దీంతో మ‌ళ్లీ మ‌ట‌న్‌ను ఉడికించాల్సి వ‌స్తుంది. ఇలా కొంద‌రు ఎల్ల‌ప్పుడూ మ‌ట‌న్‌ను ఉడికించ‌డ‌లో ఇబ్బందులు ప‌డుతూనే ఉంటారు. అయితే మ‌ట‌న్‌ను త్వ‌ర‌గా, మెత్త‌గా ఎలా ఉడికించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్‌ను వండడానికి ముందుగా ఒక గంట పాటు మారినేష‌న్ చేయాలి. దీని వ‌ల్ల త్వ‌ర‌గా ఉడుకుతుంది. మెత్త‌గా కూడా ఉంటుంది. మ‌ట‌న్‌ను బాగా క‌డిగి అందులో కాస్త పెరుగు, నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లిపి 1 గంట పాటు మారినేష‌న్ చేయాలి. పెరుగు, నిమ్మ‌ర‌సం వ‌ల్ల మ‌ట‌న్ ముక్క‌లు మెత్త‌గా మారుతాయి. దీంతో త్వ‌ర‌గా ఉడుకుతాయి. ఇలా మారినేట్ అయిన మ‌ట‌న్‌ను కుక్క‌ర్‌లో వేసి ఉడికించాలి. అయితే మ‌ట‌న్ లేతది అయితే 5 నుంచి 6 విజిల్స్ చాలు. ముదురు మ‌ట‌న్ అయితే క‌నీసం 10 విజిల్స్ రావాలి.

how to cook Mutton very quickly and soft
Mutton

ఇలా కుక్క‌ర్‌లో ఉడికించాక 80 నుంచి 90 శాతం వ‌ర‌కు మ‌ట‌న్ ఉడుకుతుంది. దీన్ని మ‌ళ్లీ కుక్క‌ర్ మూత తీసేసి మ‌రో 10 నిమిషాలు ఉడికించాలి. దీంతో మ‌ట‌న్ చాలా మెత్త‌గా ఉడుకుతుంది. త్వ‌ర‌గా కూర‌ అవుతుంది కూడా. అయితే మ‌ట‌న్‌ను ఎప్పుడు తెచ్చినా ఈ విధంగా చిట్కాల‌ను పాటిస్తే.. చాలా త్వ‌ర‌గా ఉడికించుకోవ‌చ్చు. ఇలా చేసిన మ‌ట‌న్ నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది.

Editor

Recent Posts