lifestyle

బిడ్డకు అన్న ప్రాసన ఏ నెలలో ఏ విధంగా చేయాలో తెలుసా ?

సాధారణంగా బిడ్డ పుట్టగానే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇస్తారు.ఆరు నెలల తర్వాత బిడ్డ అన్నం కోసం ఎదురు చూస్తోందని తనకు అన్నప్రాసన కార్యక్రమం చేసి అన్నం తినిపించడం చేస్తుంటారు. అయితే అన్నప్రాసన అబ్బాయిలకు ఎప్పుడు చేయాలి? అమ్మాయిలకు ఎప్పుడు చేయాలి? అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా అమ్మాయిలకు అన్నప్రాసన కార్యక్రమం ఐదు లేదా ఏడవ నెలలో చేయాలి. అదే అబ్బాయిలకు ఆరవనెల లేదా 8వ నెలలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్నప్రాసన కార్యక్రమం ఎప్పుడు కూడా ఉత్తరాయన శుక్లపక్ష తిథులలో మాత్రమే చేయాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. ముందుగా వినాయకుడికి పూజ నిర్వహించిన తర్వాత బిడ్డ తండ్రి కుడి తొడపై కూర్చోబెట్టుకుని వెండి స్పూనుతో మనం తయారు చేసిన తీపి పదార్థాన్ని ముందుగా బిడ్డ మేనమామ శిశువుకు మూడుసార్లు తినిపించాలి.

how to do anna prasana to kids

ఆ తరువాత తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించాలి. అన్నప్రాసన కార్యక్రమంలో చేసే పదార్థాలలో తప్పనిసరిగా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, బెల్లం ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ పదార్థాలతో పరమాన్నం తయారు చేసి బిడ్డకు తినిపించాలి. ఈ విధంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించాలని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts