హెల్త్ టిప్స్

ఈ ఆహార ప‌దార్థాలే.. గ్యాస్‌, కడుపు ఉబ్బ‌రాన్ని క‌లిగిస్తాయి తెలుసా..!

మ‌న‌లో అధిక శాతం మందికి భోజ‌నం చేయ‌గానే విప‌రీత‌మైన గ్యాస్ వస్తుంది. పొట్టంతా నిండిపోయిన భావ‌న క‌లుగుతుంది. కొంద‌రికి వికారం వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. అయితే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం మ‌నం తీసుకునే ఆహార‌మే అని చెప్ప‌వ‌చ్చు. మ‌నం తీసుకునే ప‌లు ఆహార ప‌దార్థాల వ‌ల్ల కూడా గ్యాస్ బాగా వ‌స్తుంది. మ‌రి.. మ‌న‌కు గ్యాస్‌ను తెప్పించే ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బీన్స్‌లో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబ‌ర్‌, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. అయితే వాటిలో ఉండే ఫైబ‌ర్ అంత త్వ‌ర‌గా జీర్ణం కాదు. అందువ‌ల్ల జీర్ణాశ‌యంలో గ్యాస్ మొద‌లవుతుంది. అదే బ‌య‌ట‌కు వెళ్ల‌లేక మ‌న‌కు క‌డుపు ఉబ్బ‌రాన్ని తెచ్చి పెడుతుంది. ఈ ఫుడ్‌ను తింటే గ‌న‌క గ్యాస్ వ‌స్తుంటే ఎవ‌రైనా ఈ ఫుడ్‌ను తిన‌డం మానేయాల్సిందే.

2. గోధుమ‌ల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రాన్ని క‌ల‌గ‌జేస్తుంది. కొన్ని సార్లు డ‌యేరియా కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఆహారం తిన్నాక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించే వారు గోధుమ‌ల‌తో త‌యారు చేసిన ఏ వంట‌కాన్ని తీసుకోక‌పోవ‌డ‌మే ఉత్తమం.

do you know that these foods cause gas trouble

3. కొంత‌మందికి క్యాబేజీ, కాలిఫ్ల‌వ‌ర్ త‌దిత‌ర కూర‌గాయ‌ల‌ను తిన్నా గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఈ ఫుడ్ తినేవారు గ్యాస్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంటే ఈ ఫుడ్‌ను తిన‌డం మానేయాల్సి ఉంటుంది.

4. పాలు, పాల సంబంధ ప‌దార్థాల‌ను కొంద‌రు బాగా తీసుకుంటారు. అయితే అవి ప‌డ‌క‌పోతే గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ ప‌దార్థాల వ‌ల్లే గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌నుకుంటే వీటిని తిన‌డం కూడా మానేయాల్సి ఉంటుంది.

5. ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహార ప‌దార్థాలు, ప్యాక్డ్ ఫుడ్‌, జంక్ ఫుడ్, శీత‌ల పానీయాల‌ను తాగినా గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. క‌నుక ఈ ఫుడ్స్‌ను వీలైనంత త‌క్కువ‌గా తీసుకుంటే బెట‌ర్‌.

Admin

Recent Posts