Ice Gola : చిన్న‌త‌నంలో అంద‌రూ ఎంతో ఇష్టంగా తిన్న ఐస్ గోలా.. త‌యారీ ఇలా..!

Ice Gola : ఐస్ గోల‌.. మ‌న‌కు వేసవి కాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. ఐస్ గోల చ‌ల్ల చ‌ల్ల‌గా వివిధ రుచుల్లో ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే మ‌న‌కు బ‌య‌ట ల‌భించే ఈ ఐస్ గోల అప‌రిశుభ్ర వాత‌వ‌ర‌ణంలో త‌యారు చేస్తూ ఉంటారు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. బ‌య‌ట కొనే ప‌నిలేకుండా ఇంట్లోనే చాలా సుల‌భంగా శుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో ఈ ఐస్ గోలాను మ‌నం తయారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. చాలా మంది ఐస్ గోలాను ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలు కాదు అని భావిస్తారు కానీ కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఐస్ గోలాను ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. స్ట్రీల్ స్టైల్ ఐస్ గోలాను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐస్ గోల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రోస్ సిర‌ప్ – ఒక క‌ప్పు, ఐస్ క్యూబ్స్ – 10 నుండి 12.

Ice Gola recipe in telugu you can make this at home
Ice Gola

కాలాక‌ట్టా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు…

పంచ‌దార – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, వేయించిన జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – అర టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, గ్రీన్ ఫుడ్ క‌ల‌ర్ – అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

ఐస్ గోల త‌యారీ విధానం..

ముందుగా కాలాక‌ట్టా త‌యారు చేసుకోవ‌డానికి గానూ క‌ళాయిలో పంచ‌దార‌, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత జీల‌క‌ర్ర పొడి, బ్లాక్ సాల్ట్, ఉప్పు వేసి క‌ల‌పాలి. పంచ‌దార పాకం మ‌రుగుతుండగానే ఒక గిన్నెలో ఫుడ్ క‌ల‌ర్ తీసుకుని అందులో నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఈ ఫుడ్ క‌ల‌ర్ ను పంచ‌దార పాకంలో త‌గినంత వేసి క‌ల‌పాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఈ పంచ‌దార పాకాన్ని లేత పాకం కంటే కొద్దిగా త‌క్కువ పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో ఐస్ క్యూబ్స్ వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత ఈ ఐస్ క్ర‌ష్ ను స్పూన్ స‌హాయంతో గ్లాస్ వేసుకోవాలి. త‌రువాత ఈ గ్లాస్ మ‌ధ్య‌లో ఐస్ స్టిక్ ఉంచాలి. త‌రువాత మిగిలిన ఐస్ క్ర‌ష్ ను గ్లాస్ నిండుగా వేసి చేత్తో కొద్దిగా లోప‌లికి వ‌త్తాలి. త‌రువాత ఈ గోల‌ను గ్లాస్ నుండి వేరు చేసుకోవాలి. త‌రువాత గోల స‌గానికి రోస్ సిర‌ప్ ను వేసుకోవాలి. త‌రువాత మిగిలిన స‌గ భాగంపై కాలాక‌ట్టాను వేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఐస్ గోల త‌యార‌వుతుంది. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా ఐస్ గోల‌ను తయారు చేసి తీసుకోవ‌చ్చు. పిల్ల‌లు దీనిని మ‌రింత ఇష్టంగా తింటారు.

D

Recent Posts