vastu

పొరపాటున ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా… వెంటనే తీసేయండి..

సాధారణంగా మొక్కలు మన ఇంటి అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. అందుకోసమే చాలా మంది వివిధ రకాల మొక్కలను తమ ఇంటి ఆవరణంలో పెంచుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మరి కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మన ఇంటి ఆవరణంలో ఎప్పుడూ కూడా పాలుకారే చెట్లు అంటే జిల్లేడు, బొప్పాయి, వంటి చెట్లను, ముల్లు కలిగినటువంటి రేగు చెట్లు, తుమ్మ చెట్లను మన ఇంటి ఆవరణంలో పెంచకూడదు.అదేవిధంగా తీగలు పాకే చెట్లను కూడా ఇంటి ఆవరణంలో పెంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మొక్కలను మన ఇంట్లో పెంచుకోవడం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

if you are growing this type of plants in home then remove them

అదేవిధంగా మన ఇంటి ఆవరణంలో చింత చెట్టు, మర్రి చెట్లు వంటి పెద్ద పెద్ద వృక్షాలను పెంచకూడదు.ఇలాంటి వృక్షాలు మన ఇంటి ఆవరణంలో ఉండటంవల్ల మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీని అడ్డుకొని పూర్తిగా నెగటివ్ వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. కనుక పెద్ద వృక్షాలను మన ఇంటి ఆవరణంలో పెంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts