food

Chapati : ఇంట్లో చ‌పాతీల‌ను చేసేట‌ప్పుడు లెక్క పెట్ట‌కండి.. ఎందుకంటే..?

Chapati : చాలా మంది రాత్రి పూట చపాతీలని ఎక్కువగా తింటూ ఉంటారు. అలానే మనం అల్పాహారం సమయంలో కూడా చపాతీలను చేసుకుని, తింటూ ఉంటాం. అయితే ఏదైనా ఆహార పదార్థాలని వండేటప్పుడు వృధా చేయకూడదని భావించి ఎంత మంది ఉన్నారో చూసుకుని వండుకుంటూ ఉంటాము. చపాతీలను చేసేటప్పుడు కూడా ఎవరు ఎన్ని చపాతీలు తింటారో చూసి వాళ్లకి కావాల్సిన అన్ని చపాతీలు చేస్తూ ఉంటాము.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చపాతీలను ఎవరినీ అడిగి లెక్కపెట్టకూడదు. ఎవరు ఎన్ని చపాతీలు తింటారు అని అడగడం మంచిది కాదు. ఎప్పుడైనా కూడా ఎన్ని తింటారు అని ఎవరిని అడక్కూడదు. అది మీపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. గోధుమ ధాన్యాలు సూర్యభగవానుడితో ముడిపడి ఉండడం వలన చపాతీలను చేసేటప్పుడు వాటిని లెక్కించకూడదని అంటారు.

you need to count chapati if you make them in home

ఒకవేళ కనుక ఎక్కువగా లెక్కించినట్లయితే సూర్య భగవానుడిని అవమానించినట్లు. ఇలా చేయడం వలన జాతకంలో సూర్యుడు బలహీనమవుతాడు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండవని వాస్తు శాస్త్రం అంటోంది. అలానే చాలామంది ఈరోజు చపాతీ పిండి మిగిలిపోయింది అని ఫ్రిజ్లో పెట్టి తర్వాత రోజు చపాతి చేసుకుందామని అనుకుంటారు.

కానీ అలా చేయడం కూడా మంచిది కాదు. హానికరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి అవడంతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఒక ప్లేట్ లో మూడు చపాతీలను కానీ అంత కంటే ఎక్కువ కానీ పెట్టకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి సంతాప దినం చేస్తారు. కర్మలో మరణించిన వారికి మూడు చపాతీలు పెడతారు. కాబట్టి ఆ తప్పును చేయకండి.

Admin

Recent Posts