vastu

మీ ఇంట్లో ప‌గిలిపోయి ఈ వ‌స్తువుల‌ను అలాగే ఉంచుకుంటున్నారా ? అయితే వెంట‌నే ప‌డేయండి.. ఎందుకో తెలుసా ?

మ‌న ఇళ్ల‌లో అనేక రకాల వ‌స్తువులు ఉంటాయి. వాటిని మ‌నం భిన్న ర‌కాల ప‌నుల‌కు ఉప‌యోగిస్తుంటాం. కానీ ప‌గిలిపోయిన వ‌స్తువుల‌ను అస‌లు ఉప‌యోగించం. అయితే వ‌స్తువులు ప‌గిలిపోయినా కొంద‌రు ఇళ్ల‌లో వాటిని అలాగే పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకోవ‌డం వ‌ల్ల అశుభం క‌లుగుతుంది. వాస్తు దోషం వ‌స్తుంది. క‌నుక ఆ వ‌స్తువుల‌ను ఇళ్ల‌లో ఉంచుకోరాదు. వెంట‌నే బ‌య‌ట వేయాలి. మ‌రి ఆ వ‌స్తువులు ఏమిటంటే..

* పగిలిన కుండ‌లు, వంట పాత్ర‌లు, ఇత‌ర వంట పాత్ర‌ల‌ను ఇంట్లో పెట్టుకోరాదు. వీటి వ‌ల్ల అశుభం క‌లుగుతుంది.

* ప‌గిలిన అద్దాల‌ను కూడా ఇంట్లో ఉంచ‌రాదు. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. కాబ‌ట్టి వీటిని కూడా ప‌డేయాలి.

if you are keeping broken items in home then throw them off

* ఇంట్లో మంచాలు కూడా చ‌క్క‌ని కండిష‌న్‌లో ఉండాలి. ప‌గిలిపోయి ఉంటే భార్యాభ‌ర్తల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తుంటాయి. వైవాహిక జీవితం స‌రిగ్గా ఉండ‌దు.

* ప‌గిలిపోయిన వాచ్‌ల‌ను కూడా ఇంట్లో పెట్టుకోరాదు. దీంతో అశుభాలు క‌లుగుతాయి. బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది.

* ప‌గిలిపోయిన‌, ధ్వంస‌మైన ఫ‌ర్నిచ‌ర్‌ను కూడా ఇంట్లో ఉంచుకోరాదు. వాటి వ‌ల్ల జీవితంలో అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తుంటాయి. ఇంట్లో అంద‌రికీ ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి వాటిని కూడా ప‌డేయాలి.

Admin

Recent Posts