lifestyle

Beard : త‌ర‌చూ గ‌డ్డం పూర్తిగా తీసేస్తున్నారా.. ఇది చదివితే ఇక‌పై ఆ ప‌ని చేయ‌రు..!

Beard : గడ్డం ఉంటే అడ్డం అనుకుని చాలా మంది గడ్డాన్ని క్లీన్ షేవ్ చేస్తుంటారు. ఇక కొందరు చాలా తక్కువ సైజులో వెంట్రుకలు కనిపించేలా గడ్డాన్ని స్టైల్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే.. ఇకపై ఎవరూ గడ్డాన్ని తీసేయడానికి ఇష్టపడరు సరికదా.. ఇంకా ఎక్కువగా గడ్డం పెంచుకుంటారు. ఎందుకంటే.. గడ్డం వల్ల చర్మం సంరక్షింపబడుతుందట. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి గడ్డం రక్షిస్తుందట. అవును.. షాకింగ్‌గా ఉన్న ఇది నిజమే. పలువురు సైంటిస్టుల పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్‌ల్యాండ్, బ్రిటిష్ స్కిన్ ఫౌండేషన్ సంస్థలు వేర్వేరుగా చేసిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. పురుషులు పెంచుకునే గడ్డం వల్ల సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాల బారి నుంచి 95 శాతం వరకు రక్షణ లభిస్తుందట.

if you are removing your beard completely then take a look at this

అలాగే చర్మ క్యాన్సర్లు రాకుండా ఉంటాయట. దీంతోపాటు చర్మానికి సంరక్షణ లభిస్తుందట. అందువల్ల ఇకపై పురుషులు ఎవరైనా సరే.. గడ్డం అడ్డంగా ఉందని పూర్తిగా క్లీన్ షేవ్ చేసేముందు ఒక్కసారి ఆలోచించండి. గ‌డ్డం ఉండ‌డం వ‌ల్ల ఈ లాభాలు కలుగుతాయి. అయితే కొంద‌రికి గ‌డ్డం ప‌రంగా చ‌ర్మం దుర‌ద‌లు వ‌స్తుంది. అలాంటి వారు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. మిగిలిన ఎవ‌రైనా స‌రే గ‌డ్డం పెంచుకోవ‌డంపై దృష్టి సారించండి.

Admin

Recent Posts