Loan From Bank : సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలామందికి, ఈ విషయంపై అవగాహన లేదు. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే, కచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిబిల్స్ స్కోర్ బాగుంటే, లోన్ ఈజీగా వస్తుంది. చాలా మంది, లోన్ కోసం విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే, సిబిల్ స్కోర్ బాగుంటేనే, లోన్ వస్తుంది. ఈ విషయం పైన మనకి నిత్యం పలు బ్యాంకుల నుండి ఫోన్లు లేదా మెసేజ్ లు వస్తూ ఉంటాయి. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి..? ఈ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి..? ఎంత తక్కువ ఉంటే లోన్స్ కానీ క్రెడిట్ కార్డులు కానీ ఇవ్వరు అనే విషయాలను మనం ఇప్పుడే చూద్దాం.
సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. వ్యక్తుల, క్రెడిట్ సంబంధిత కార్యకలాపాల రికార్డులను చూసే కంపెనీ ఇది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతి నెలా లోన్స్ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ ని సిబిల్ కి ఇస్తాయి. అయితే, ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టీ, వ్యక్తులకు సంబంధించిన క్రెడిట్ స్కోర్ ని సిబిల్ అందిస్తుంది. అయితే, ఎటువంటి లోన్ ని పొందాలన్నా, సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం.
బ్యాంకులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్న లోన్ ని, తిరిగి చెల్లించిన వివరాల ఆధారంగా క్రెడిట్ స్కోర్ ని కౌంట్ చేస్తారు. లోన్ ని మళ్ళీ కట్టేటప్పుడు సమస్య వున్నా లేదంటే, గడువును మించి చెల్లించినా వాటి ప్రభావం సిబిల్ స్కోర్ మీద పడుతుంది.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ సిబిల్ రిపోర్ట్‌లో ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి సిబిల్ స్కోర్, రుణాలు తీసుకోవడం, చెల్లించడం తో పాటుగా, వ్యక్తిగత వివరాలు, కాంట్యాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ మొదలైనవి అన్నీ కూడా ఉంటాయి. CIBIL స్కోర్‌ను పెంచుకోవడానికి ఆర్థిక వివేకం ఉండాలి. క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో కట్టడం, బౌన్స్ అయిన చెక్కులను నివారించడం, అనవసరమైన రుణ దరఖాస్తులకు దూరంగా ఉండటం వంటివి సిబిల్ స్కోర్ బాగుండేలా చూస్తాయి.