ఆధ్యాత్మికం

Lakshmi Devi And Broom : మీ ఇంట్లో చీపురును ఈ ప్ర‌దేశంలో పెట్టండి.. డ‌బ్బుకు అస‌లు లోటు ఉండ‌దు..!

Lakshmi Devi And Broom : హిందూ ధ‌ర్మ శాస్త్రాల ప్రకారం ఇంటిని శుభ్రం చేసేదే అయిన‌ప్ప‌టికి చీపురును ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. చీపురుకు, సంప‌ద‌కు దేవ‌త అయిన ల‌క్ష్మీ దేవికి సంబంధం ఉందని విశ్వ‌సిస్తారు. ఇంటిని శుభ్ర‌ప‌ర‌చ‌డంతో పాటు ధ‌న‌వంతులుగా మార‌డానికి కూడా చీపురు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. వాస్తుశాస్త్రంలో చీపురుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. అంతేకాకుండా వాస్తుశాస్త్రంలో చీపురు ఎప్పుడు కొనాలి, చీపురును ఎక్క‌డ ఉంచాలి, చీపురును వినియోగించే విధానం గురించి కూడా తెలియ‌జేసారు. ఈ నియ‌మాల‌ను దృష్టిలో ఉంచుకుని చీపురును వినియోగించిన వారిపై ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హాన్ని కురిపిస్తుంది. చీపురును చ‌క్క‌గా ఉప‌యోగించే వారి ఇంట్లో ఎప్పుడూ డ‌బ్బుకు లోటు కూడా ఉండ‌దు. ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సానుకూల‌త ఉంటుంది. ఇంట్లో ఉండే వారు చేసే ప‌నుల్లో పురోగ‌తి చెందుతారు. వాస్తుశాస్త్రంలో చీపురు గురించి తెలియ‌జేసిన నియ‌మాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో చీపురును ఎప్పుడూ కూడా ద‌క్షిణం మరియు ప‌డ‌మ‌ర దిశ‌ల మ‌ధ్య ఉంచ‌డం మంచిది. చీపురును ఈ దిశ‌లో ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లో సంప‌ద పెరుగుతుంది. అలాగే చీపురును ఎప్పుడూ నిల‌బెట్టి ఉంచ‌కూడ‌దు. చీపురును అడ్డంగా మంచిది. నిలువుగా ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లో సంప‌ద ఉండ‌దు. అదే విధంగా వంట‌గ‌దిలో మరియు ప‌డ‌క‌గ‌దిలో చీపురును ఉంచ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో పేద‌రికం పెరుగుతుంది. అలాగే చీపురును బ‌య‌టి వారికి క‌నిపించ‌కుండా ఉంచాలి. అలాగే చీపురు ఎప్పుడూ కూడా శుభ్రంగా, మంచి స్థితిలో ఉండాలి. విరిగిన చీపురును ఉప‌యోగించ‌కూడ‌దు. చీపురు మురికి లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా చీపురును ఎప్పుడూ కూడా కాళ్ల‌తో త‌న్న‌డం, తొక్క‌డం వంటివి చేయ‌వ‌ద్దు. పొర‌పాటున కాళ్ల‌కు చీపురు తాకినా దానికి క్ష‌మాప‌ణ చెప్పాలి. దీపావ‌ళి రోజున కొత్త చీపురును తీసుకుని పూజ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఏడాది పొడ‌వునా ఇంట్లో సంప‌ద ఉంటుంది.

put broom in your home like this for wealth

అలాగే సూర్యోద‌యం త‌రువాత సూర్యాస్త‌మ‌యం ముందు మాత్ర‌మే చీపురును ఉప‌యోగించాలి. సూర్య‌స్త‌మ‌యం త‌రువాత చీపురును వాడితే వారిని ల‌క్ష్మీ దేవి పేద‌వాళ్లని చేస్తుంద‌ని నమ్ముతారు. ఇక సోమ‌వారం శుక్ల‌ప‌క్షంలో చీపురును కొన‌కూడ‌దు. అమావాస్య‌, మంగ‌ళ‌వారం, శ‌నివారం, ఆదివారాల‌ల్లో మాత్రమే చీపురును కొనాలి. ఈ విధంగా చీపురు గురించిన ప్ర‌త్యేక నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌న‌పై ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం ఉంటుంద‌ని ఆర్థిక స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయని పండితులు తెలియ‌జేస్తున్నారు.

Admin

Recent Posts