హెల్త్ టిప్స్

Acidity : క‌డుపులో మంట‌ను త‌గ్గించే నాచుర‌ల్ టిప్స్‌.. ఏం చేయాలంటే..?

Acidity : మనలో అధికశాతం మందికి సహజంగనే కారం, మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు లేదా మద్యం అధికంగా సేవించినప్పుడు కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. దీన్నే గ్యాస్ట్రయిటిస్‌ అని అంటారు. సాధారణంగా ఈ సమస్య వస్తే ఒకటి, రెండు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొందరికి ఈ సమస్య ఒక పట్టాన తగ్గదు. అలాంటి వారు కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. ఒక గ్లాస్‌ చల్లని నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల చక్కెర వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తాగితే కడుపులో మంట నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజుకు రెండు, మూడు సార్లు చేస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.

కొబ్బరినీళ్లను తరచూ తాగడం వల్ల కూడా కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. కొబ్బరి నీళ్లు జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో కడుపులో మంట తగ్గుతుంది. అల్లం రసంలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అల్లం రసాన్ని రోజుకు నాలుగైదు సార్లు తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది. అవసరం అనుకుంటే అందులో తేనె కూడా కలుపుకోవచ్చు. పచ్చి బొప్పాయి పండ్లను తినడం వల్ల కూడా కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. వాటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కడుపులో మంటను తగ్గిస్తాయి.

natural tips to reduce acidity natural tips to reduce acidity

బేకింగ్‌ సోడా అంటాసిడ్‌లా పనిచేస్తుంది. అందువల్ల బేకింగ్‌ సోడాతో కడుపులో మంటను తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్‌ నీటిలో ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి బాగా కలిపి ఆ నీటిని తాగితే కడుపులో మంట తగ్గుతుంది. క్యాబేజీ, క్యారెట్లను జ్యూస్‌గా చేసుకుని తాగినా కడుపులో మంట తగ్గుతుంది. వీటిలో ఉండే ఔషధ కారకాలు కడుపులో ఏర్పడే అల్సర్లను నయం చేస్తాయి. అలాగే జీర్ణాశయం లోపలి వైపు ఉన్న పొరను యాసిడ్ల బారి నుంచి రక్షిస్తాయి. అందువల్ల కడుపులో మంట తగ్గుతుంది.

Admin

Recent Posts