Peacock Feathers : జోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో నెమలి ఈకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణుడు నెమలి ఈకలను చాలా ఇష్టపడతాడు. కృష్ణుడు ఎప్పుడూ కూడా నెమలి ఈకలను ధరిస్తాడు. ఇవి ఎంతో అందంగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టపడతారు. ఇంట్లో కూడా వీటిని అలంకరణ వస్తువుగా ఉంచుతారు. అయితే నెమలి ఈకలను అందరూ ఇష్టపడినప్పటికి వీటిని ఇంట్లో ఉంచడంపై మనలో చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవచ్చా..? లేదా..? ఇంట్లో నెమలి ఈకలను ఉంచుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి..అసలు వీటిని ఏ దిశలో ఉంచాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ నెమలిఈకలను ఇంట్లో ఉంచుకోవచ్చు.
వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల సంతోషం మరియు శ్రేయస్సు కలుగుతుంది. వాస్తు శాస్త్రంలో నెమలి ఈకలకు ఎంతో ప్రాధాణ్యత ఉంది. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల అనేక వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే వీటిని ఇంట్లో సరైన దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సంపదకు లోటు ఉండదు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆర్థికంగా చాలా బలంగా తయారవుతారు. నెమలి ఈకలను ఇంట్లో దక్షిణ దిశలో ఉంచడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. దక్షిణ దిశతో పాటు వీటిని నైరుతి దిశలో, తూర్పు దిశలో కూడా ఉంచుకోవచ్చు. ఇంట్లోని వారి జాతకంలో రాహుదోషం ఉంటే నెమలి ఈకలను తూర్పు లేదా వాయువ్య దిశలో ఉంచడం మంచిది. రాహుదోషం వల్ల విజయాలు సాధించలేకపోవడం, ఆటంకాలు ఎదురవడం వంటివి జరుగుతాయి.
ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం వల్ల రాహుదోషం వల్ల కలిగే సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే పిల్లల గదిలో స్టడీ టేబుల్ దగ్గర ఒకటి లేదా రెండు నెమలి ఈకలను ఉంచడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.అలాగే ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతూ ఉంటే ఇంట్లో తూర్పు గోడపై 7 నెమలి ఈకలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శాంతి కలుగుతుంది.
అలాగే ఇంట్లో వైవాహిక జీవితానికి సంబంధించి గొడవలు జరుగుతూ ఉంటే పడక గదిలో నైరుతి దిశలో 2 నెమలిఈకలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల గొడవలు తగ్గి బంధం బలపడుతుంది. అలాగే ఇంట్లో వాస్తు దోషం గనుక ఉంటే సోమవారం నాడు 8 నెమలి ఈకలను తీసుకుని వాటిని దగ్గరగా కట్టాలి. తరువాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈవిధంగా నెమలి ఈకలను సరైన దిశలో ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.