చిట్కాలు

Betel Leaves For Hair Growth : త‌మ‌ల‌పాకుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Betel Leaves For Hair Growth : ప్రతి ఒక్కరు కూడా, అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అందమైన కురుల కోసం, అనేక రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా, అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. తమలపాకులతో అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. తమలపాకులో యాంటీ టాక్సిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలానే, యాంటీ డయాబెటిక్ గుణాలు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా తమలపాకులో ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి టు తో పాటుగా ఇతర పోషకాలు కూడా తమలపాకుల్లో ఉంటాయి.

తమలపాకులతో చక్కటి లాభాలని పొందవచ్చు. శీతాకాలంలో జుట్టు పొడిబారి పోతుంది. చిట్లి పోతుంది కూడా. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి, తమలపాకుల్ని మిక్సీలో వేసుకుని, కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలో, రెండు స్పూన్లు తేనె వేసి మిక్స్ చేయండి. ఈ పేస్ట్ ని తలకి, జుట్టుకి ప్యాక్ లాగ వేసి అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో, తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ ని మాడుకి రాస్తే, జుట్టు బాగా ఉంటుంది జుట్టుని. మృదువుగా ఉంటుంది.

Betel Leaves For Hair Growth use them in this method

అలానే, జుట్టు ని ఒత్తుగా మారుస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే, తమలపాకుల్ని పేస్ట్ కింద చేసుకుని, రెండు స్పూన్లు కొబ్బరి నూనె ఒక స్పూన్ ఆముదం కలపాలి. మిశ్రమాన్ని మాడు నుండి కుదుళ్ల దాకా పట్టించాలి. అరగంట అయ్యాక, తల స్నానం చేస్తే సరిపోతుంది. వారానికి, రెండుసార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

తమలపాకులలో మందార పూలు, కరివేపాకు, తులసి ఆకులు మిక్సీలో వేసి, తగినంత నీళ్లు పోసి పేస్ట్ కింద చేసుకోవాలి. రెండు స్పూన్లు కొబ్బరి నూనె కలిపి తలకి రాసి గంట తర్వాత స్నానం చేయాలి. వారానికి రెండుసార్లు, ఈ ప్యాక్ వేసుకుంటే మంచిది. జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది.

Admin

Recent Posts