ఆధ్యాత్మికం

Temple : ఆల‌యంలో గ‌ర్భ గుడి వెనుక చేత్తో తాకుతున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

Temple : ఆల‌యాల‌కు వెళ్లి దైవాన్ని ద‌ర్శించుకుని పూజ‌లు చేయ‌డం చాలా మంది చేస్తుంటారు. త‌ర‌చూ ఆల‌యాల‌కు వెళ్ల‌డం వ‌ల్ల ఆధ్యాత్మిక చింత‌న అల‌వ‌డ‌డంతోపాటు అనుకున్న కోరిక‌లు నెర‌వేరుతాయి. ఇష్ట‌దైవాన్ని పూజించ‌డం వ‌ల్ల ఆ దైవం ఆశీస్సులు ల‌భిస్తాయి. దీంతో అన్నీ అనుకూల ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు చాలా మంది ప్ర‌ద‌క్షిణ‌లు చేసే స‌మ‌యంలో గ‌ర్భ‌గుడి వెనుక భాగం వ‌ద్ద చేత్తో తాకుతుంటారు. వాస్త‌వానికి శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం.. అలా చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు.

ఆల‌య గ‌ర్భ గుడి వెనుక భాగంలో చాలా మంది ప్ర‌ద‌క్షిణ‌లు చేసేట‌ప్పుడు చేత్తో తాకుతుంటారు. కానీ ఆ ప్ర‌దేశంలో రాక్ష‌సులు కొలువై ఉంటార‌ట‌. అందువ‌ల్ల అక్క‌డ చేత్తో తాకితే వారిని నిద్ర లేపిన‌ట్లు అవుతుంద‌ట‌. దీంతో రాక్ష‌సుల ప్ర‌తికూల ప్ర‌భావాలు మ‌న‌పై ప‌డుతాయ‌ట‌. దీని వ‌ల్ల అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయ‌ట‌. క‌నుక ఆల‌యం గ‌ర్భ గుడి వెనుక చేత్తో తాక‌రాదు.

if you are touching temple back side then do not do like that

ఆల‌యం గ‌ర్భ గుడి వెనుక చేత్తో తాకితే ఆల‌యంలో పూజ‌లు చేసి సంపాదించిన పుణ్యం మొత్తం పోతుంది. దైవం ఆశీస్సులు ల‌భించ‌వు. అన్నీ ప్ర‌తికూల ఫ‌లితాలే ఎదుర‌వుతాయి. అశుభాలే క‌లుగుతాయి.

ఆల‌య గ‌ర్భ‌గుడి వెనుక చేత్తో తాక‌డం వ‌ల్ల ఎలాంటి కోరిక‌లు నెర‌వేర‌వు. ప్ర‌తికూల ప్ర‌భావాలు ఉండ‌డంతో ఏ ప‌ని చేసినా విజ‌యం సాధించ‌లేక‌పోతుంటారు. క‌నుక ఆల‌యంలో గ‌ర్భ గుడి వెనుక భాగాన్ని అసలు ఎట్టి ప‌రిస్థితిలోనూ చేత్తో తాక‌రాదు.

Admin

Recent Posts