lifestyle

Birth Mark : ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే ధన లాభం కలుగుతుంది..!

Birth Mark : శరీరం మీద ఉండే పుట్టుమచ్చల ఆధారంగా, మనం కొన్ని విషయాలని చెప్పచ్చు. ముక్కు మీద కనుక ఎవరికైనా పుట్టుమచ్చ ఉంటే, వాళ్ళకి కోపం బాగా ఎక్కువ ఉంటుంది. ఎడమ తొడ మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే, ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు వ్యాపారంలో కూడా బాగా సంపాదిస్తారు. పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే, వారికి భోజనం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతారు. కుడి తొడ మీద పుట్టు మచ్చ ఉన్నట్లయితే కచ్చితంగా ధనవంతులు అవుతారు.

ఒకవేళ కనుక స్త్రీలకి తొడల మీద కానీ మర్మస్థానం మీద కానీ ఉంటే అక్రమ సంబంధాలు వారికి ఏర్పడతాయి. దాంపత్యాన్ని కోల్పోతారు. పొట్ట కింద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అనారోగ్యం కలుగుతుంది. కుడి కన్ను మీద పుట్టుమచ్చ ఉంటే, అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారు. పుట్టుమచ్చలు పురుషులకి కుడివైపు, స్త్రీలకి ఎడమ వైపు ఉంటే ఎక్కువ ఫలితాలు కనపడతాయట.

if you have birth mark on this place then you are lucky

బొటనవేలు మీద పుట్టుమచ్చ ఉంటే చేతి విద్యలో, వ్యాపారంలో సంపాదిస్తారు. నుదుటి మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే, ధనవంతులు అవుతారు. అలానే మేధావులు అవుతారు. కుడి చేయి చూపుడు వేలు మీద పుట్టుమచ్చ ఉంటే ధన లాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి.

గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధన లాభం కలుగుతుంది. కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే, త్యాగబుద్ధి, కీర్తి ఉంటుంది. మెడ మీద కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే భార్య తరపున ధన లాభం. మోచేయి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే, వ్యవసాయంలో కలిసి వస్తుంది. అదే బొడ్డు లోపల ఉన్నట్లయితే, ధన లాభం కలుగుతుంది. పురుషుడి కి పురుషాంగం మీద పుట్టు మచ్చ ఉంటే పర స్త్రీ వ్యామోహం, కష్టనష్టాలు ఎదుర్కొంటాడు.

Admin

Recent Posts