vastu

మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉంటే తీసేయండి.. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!!

జీవితంలో ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని, ధ‌నం పోగెయ్యాల‌ని భావిస్తుంటారు. అందుక‌నే క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ కొంద‌రికి మాత్రం ఎంత సంపాదించినా డ‌బ్బు నిల‌వ‌దు. కొంద‌రికి ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన వ‌స్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయాలి. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు అలా వ‌స్తూనే ఉంటాయి.

ఇంట్లో ప‌గిలిపోయిన అద్దాలు, ప‌గుళ్లు వ‌చ్చిన అద్దాలు, గాజు వ‌స్తువులు, విరిగిన మంచం, ఉప‌యోగించ‌ని వంట పాత్ర‌లు, ఆగిపోయిన గ‌డియారం, రూపం చెదిరిన దేవుళ్ల విగ్ర‌హాలు, విరిగిన ఫ‌ర్నిచ‌ర్‌, చెడు ఫొటోలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, విరిగిన త‌లుపు, ప‌నిచేయ‌ని పెన్నులు వంటి వ‌స్తువుల‌ను ఉంచ‌రాదు. దీని వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సారం అవుతుంది. ధ‌నం ల‌భించ‌దు. వ‌చ్చినా ఏదో ఒక రూపంలో ఖ‌ర్చ‌వుతుంది. దీనికి తోడు ఆర్థిక స‌మ‌స్య‌లు క‌లుగుతాయి.

if you have these items in your home then remove them immediately

క‌నుక ఆయా వ‌స్తువుల‌ను ఇంట్లో నుంచి వెంట‌నే తీసేయాలి. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ధ‌నం నిల‌క‌డ‌గా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఈ సూచ‌న‌ను పాటించాల్సి ఉంటుంది.

Admin

Recent Posts