business

బంగారం ఏ దేశంలో తక్కువకు లభిస్తుందో తెలుసా..?

ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. డబ్బులు దాచి బంగారాన్ని కొంటూ ఉంటారు. చాలా మంది ఈ రోజుల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. అయితే బంగారం ఎక్కడ తక్కువ ధరకి మనకి లభిస్తుంది..? కచ్చితంగా దుబాయ్ అయితే కాదు. బంగారం ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది అనేది చూస్తే.. ఇండోనేషియాలో తక్కువ ధరకు బంగారం దొరుకుతుంది.

24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,330,266 IDR (ఇండోనేషియా రూపాయి), 10 గ్రాములకు సుమారు రూ. 71,880. భారతదేశంలో, అక్టోబర్ 12న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,700గా ఉంది, ఫలితంగా 10 గ్రాముల ధర రూ.5,820గా ఉంది.

in which country gold is very cheap

మలావి తూర్పు ఆఫ్రికా దేశం లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,482,660.70 MWK (మలావియన్ క్వాచా)గా ఉంది, ఇది 10 గ్రాములకు రూ.72,030గా ఉంది. ఇండియాతో పోలిస్తే రూ.5,670 వ్యత్యాసం ఉంది. హాంకాంగ్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు HKD 665 లేదా 10 గ్రాములు. అక్కడకు ఇక్కడకు 5,650 వ్యత్యాసం ఉంది. అక్టోబర్ 12న, కంబోడియాలో బంగారం ధర 347,378.43 KHR (కంబోడియన్ రీల్) లేదా 10 గ్రాములకు రూ. 72,060గా ఉంది. UAEలోని ఇతర ఎమిరేట్స్‌ తో పోలిస్తే దుబాయ్‌ లో బంగారం తక్కువకు వస్తోంది.

Peddinti Sravya

Recent Posts