Instant Kulfi : బ‌య‌ట షాపుల్లో ల‌భించే కుల్ఫిని ఇన్‌స్టంట్‌గా మ‌నం ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Instant Kulfi : మ‌న‌లో చాలా మంది కుల్ఫీల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. చ‌ల్ల‌చ‌ల్ల‌గా, ఎంతో రుచిగా ఉండే ఈ కుల్ఫీలను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ కుల్ఫీలు మ‌న‌కు ఎక్కువ‌గా ఐస్ క్రీమ్ పార్ల‌ర్ ల‌లో, బేక‌రీల‌ల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో ల‌భిస్తూ ఉంటాయి. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఎంతో రుచిగా ఉండే కుల్ఫీల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం 5 నిమిషాల్లోనే చాలా రుచిగా ఉండేలా కుల్ఫీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ కుల్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైసెస్ – 2, గోరు వెచ్చ‌ని పాలు – పావు లీటర్, కండెన్డ్స్ మిల్క్ – ఒక క‌ప్పు, ఫ్రెష్ క్రీమ్ – ఒక క‌ప్పు, వేడి పాల‌ల్లో నాన‌బెట్టిన కుంకుమ పువ్వు – చిటికెడు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్, పిస్తా పలుకులు – కొద్దిగా, జీడిప‌ప్పు ప‌లుకులు – కొద్దిగా.

Instant Kulfi recipe in telugu make just like sold in shops
Instant Kulfi

ఇన్ స్టాంట్ కుల్ఫీ త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటికి చుట్టూ ఉండే అంచుల‌ను తీసి వేయాలి. త‌రువాత వాటిని ముక్క‌లుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత వాటిపై గోరు వెచ్చ‌ని పాల‌ను పోసి 2 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ బ్రెడ్ స్లైసెస్ ను పాల‌తో స‌హా జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులోనే కండెన్డ్స్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ , నాన‌బెట్టిన కుంకుమ పువ్వు, యాల‌కుల పొడి వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు కుల్ఫీ అచ్చుల‌ను తీసుకుని వాటిలో కొద్దిగా పిస్తా ప‌లుకులు, బాదం ప‌లుకులు వేయాలి.

త‌రువాత ఇందులో ముందుగా త‌యారు చేసుకున్న కుల్ఫీ మిశ్ర‌మాన్ని వేసి మూత పెట్టాలి. కుల్ఫీ అచ్చులు లేని వారు గ్లాసులు, క‌ప్పులు, మూత ఉండే చిన్న ప్లాస్టిక్ డ‌బ్బాల్లో ఈ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న కుల్ఫీ అచ్చుల‌ను ఒక గిన్నెలో బియ్యం పోసి అందులో క‌ద‌ల‌కుండా ఉంచాలి. త‌రువాత వీటిని 12 గంట‌ల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత కుల్ఫీకి మ‌ధ్య‌లో పుల్ల గుచ్చి నీటిలో ఉంచితే అచ్చు నుండి కుల్ఫీ సుల‌భంగా బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ కుల్ఫీ త‌యార‌వుతుంది. దీనిని పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts