యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీని చూసేందుకు ఎన్‌టీఆర్ అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. దీనికి తోడు బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న మూవీ కావడం, ఇందులో ఆమె గ్లామర్ ప్రదర్శన తోడవడంతో ఈ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే దేవర మొత్తం 2 పార్ట్‌లుగా రిలీజ్ కానుంది. కొరటాల శివ దీనికి దర్శకుడు. అయితే ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ రత్నవేలు తెలియజేశారు. ఈ మూవీకి ఆయనే పనిచేశారు. సముద్రం, ఫైటింగ్ సీన్లను చూస్తేనే మూవీని ఎంత పర్‌ఫెక్ట్‌గా రత్నవేలు తెరకెక్కించారో ఇట్టే అర్థమవుతుంది. ఇక ఆయన ఈ మూవీ గురించి ఏం చెప్పారంటే.. పార్ట్ 1 లో మొత్తం 3వేల సీజీ షాట్స్ ఉన్నాయన్నారు.
సెట్స్‌ను రూపొందించడానికి చాలా కష్టపడ్డారని రత్నవేలు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలెంజింగ్‌గా ఉండేదని, అండర్ వాటర్ అండ్ ఓవర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌లలో వర్క్ చేయడం ఎగ్జైటింగ్‌గా అనిపించిందని అన్నారు. 30 నిమిషాల అండర్ వాటర్ సీన్ ఫుటేజ్ ఉంటుందని, మొదట 2 పార్ట్‌లు ఉంటుందని అనుకోలేదని తెలిపారు. ఇలా ఆయన పలు విషయాలను వెల్లడించారు.