ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చి వెర్రి తలలు వేస్తోంది. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కొందరు ఏం చేయడానికైనా సరే వెనుకాడడం లేదు. చాలా మంది లోయల వద్ద సాహసాలను చేస్తూ మృత్యువు ఒడికి చేరుకుంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఆ యువతి మాత్రం కొత్త పంథాను ఎంచుకుంది. రీల్స్ పిచ్చితో ఆమె చేసిన చేష్టలకు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది.. అనే విషయానికి వస్తే..
మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో 56 మార్కెట్ అనే ఏరియాలో ఇటీవల ఓ యువతి నడి రోడ్డుపై రాత్రి పూట పబ్లిగ్గా అందరూ చూస్తుండగానే కేవలం బ్రా మాత్రమే ధరించి రోడ్డుపై తిరిగింది. దీంతో వాహనదారులు, పాదచారులు అందరూ ఆమెను చూసి షాకయ్యారు. ఆమె ఇలాంటి దుస్తులను ధరించిందేమిటి.. అని విస్మయం వ్యక్తం చేశారు.
అయితే తరువాత తెలిసిందేమిటంటే.. కేవలం రీల్స్ కోసమే, ఓవర్‌నైట్ పబ్లిసిటీ కోసం, ఫాలోవర్లను పెంచుకోవడం కోసమే ఆమె ఇలా చేసిందని తేలింది. అయితే రాత్రి మళ్లీ ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను అలాంటి దుస్తులను ధరించినందుకు తనను క్షమించాలని కోరింది. తనను అందరూ తిడుతున్నారని, ఇకపై అలాంటి దుస్తులను ధరించనని చెప్పింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమెను నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. మరోవైపు కొందరు ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం నమోదు చేశారు.