Iyengar Bakery Sandwich : అయ్యంగార్ బేక‌రీ శాండ్‌విచ్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి..!

Iyengar Bakery Sandwich : మ‌నం బ్రెడ్ తో చేసే వివిధ ర‌కాల స్నాక్ ఐట‌మ్స్ లో సాండ్విచ్ కూడా ఒక‌టి. సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ సాండ్విచ్ లను త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ చేసే సాండ్విచ్ ల‌తో పాటు కింద చెప్పిన విధంగా త‌యారు చేసే అయ్యంగార్ సాండ్విచ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ సాండ్విచ్ కేవ‌లం అయ్యంగార్ బేక‌రీల్లో మాత్ర‌మే ల‌భిస్తుంది. ఈ సాండ్విచ్ కొద్దిగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.ఈ సాండ్విచ్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అయ్యంగార్ బేకరీ స్టైల్ సాండ్విచ్ ను మ‌నం ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అయ్యంగార్ బేక‌రీ సాండ్విచ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, ట‌మాట – 1, క్యాప్సికం త‌రుగు – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము – పావు కప్పు, క్యాబేజి త‌రుగు – ఒక క‌ప్పు, ఉప్పు – కొద్దిగా, కారం- అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కొత్తిమీర త‌రుగు – అర క‌ట్ట‌, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్.

Iyengar Bakery Sandwich recipe in telugu very easy to prepare
Iyengar Bakery Sandwich

అయ్యంగార్ బేక‌రీ సాండ్విచ్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళ‌యాఇలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటాలో ఉండే గింజ‌లు తీసేసి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి వేసుకోవాలి. త‌రువాత క్యాప్సికం, ప‌చ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క్యాబేజి తురుము వేసి వేయించాలి. దీనిని కూడా ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పెనంమీద బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. త‌రువాత బ్రెడ్ స్లైసెస్ ఉంచి కాల్చుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత కాల్చుకున్న బ్రెడ్ స్లైస్ ను తీసుకుని దానిపై త‌యారు చేసుకున్న స్ట‌ఫింగ్ ను ఉంచాలి. త‌రువాత దీనిపై మ‌రో బ్రెడ్ స్లైస్ ను ఉంచి త్రిభుజాకారంలో కట్ చేసుకుని ట‌మాట కిచ‌ప్ తో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అయ్యంగార్ బేక‌రీ సాండ్విచ్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts