Pakam Puri : పాకం పూరీల‌ను ఈ ప‌ద్ధ‌తిలో చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Pakam Puri : మ‌న తెలుగు వారి తీపి వంట‌కాల్లో పాకం పూరీలు కూడా ఒక‌టి. పాకం పూరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. పాకం పూరీలను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ పాకం పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పాకం పూరీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – పావు క‌ప్పు, ఉప్పు – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పంచ‌దార – అర‌కిలో, నీళ్లు – 150 ఎమ్ ఎల్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిపడా.

Pakam Puri recipe in telugu make in this method
Pakam Puri

పాకం పూరీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఉప్పు, నెయ్యి వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్నినీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో పంచ‌దార‌, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగి తీగ‌పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. పంచ‌దార తీగ పాకం రాగానే యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పూరీలా వ‌త్తుకోవాలి.

ఇప్పుడు దీనిపై నూనె వేసి పూరీ అంతా రాసుకోవాలి. త‌రువాత మ‌డ‌త పెట్టి మ‌ర‌లా పూరీలా వ‌త్తుకోవాలి. ఇలా వ‌త్తుకున్న పూరీని వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. పూరీని రెండు వైపులా కాల్చుకుని నూనె నుండి బ‌య‌టకు తీసి పంచ‌దార పాకంలో వేసుకోవాలి. వీటిని ఒక నిమిషం పాటు అలాగే ఉంచి త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాకం పూరీలు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 5 నుండి 7 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా త‌యారు చేసిన పాకం పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts