Jonna Gatka : మ‌న పూర్వీకులు దీన్ని తినే వందేళ్లు బ‌తికారు.. ఎలా చేయాలంటే..?

Jonna Gatka : మ‌నం జొన్న‌ల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. చిరుధాన్యాలైన జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్న‌ల‌ను పిండిగా చేసి రొట్టెలు చేయ‌డంతో పాటు వీటిని ర‌వ్వ‌గా చేసి గ‌ట్కా వంటి వాటిని కూడా త‌యారు చేస్తారు. జొన్న గ‌ట్కా చాలా రుచిగా ఉంటుంది. పాత‌కాల‌ను తెలంగాణా వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. జొన్న గ‌ట్క‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ అదుపులో ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది. తెల్ల‌బియ్యంతో వండిన అన్నం కంటే జొన్న గ‌ట్క‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. జొన్న ర‌వ్వ‌తో ఆరోగ్యానికి మేలు చేసే జొన్న గ‌ట్క‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్న గ‌ట్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జొన్న ర‌వ్వ – ఒక క‌ప్పు, నీళ్లు – 3 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌.

Jonna Gatka recipe in telugu very healthy easy to make
Jonna Gatka

జొన్న గ‌ట్కా త‌యారీ విధానం..

ముందుగా జొన్న ర‌వ్వ‌ను శుభ్రంగా క‌డిగి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ర‌వ్వ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మంట‌ను చిన్న‌గా చేసి మూత పెట్టాలి. ఈ ర‌వ్వ‌ను మ‌ద్య మ‌ధ్య‌లో క‌లుపుతూ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ర‌వ్వ పూర్తిగా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జొన్న గ‌ట్కా త‌యార‌వుతుంది. ఈ గ‌ట్కా చ‌ల్లారే కొద్ది గ‌ట్టిప‌డుతుంది క‌నుక దీనిని కొద్దిగా ప‌లుచ‌గా ఉండ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసిన జొన్న గ‌ట్కా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వెజ్,నాన్ వెజ్ కూర‌ల‌ల్లో దేనితో తిన్నా కూడా ఈ గట్కా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts