ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో దేవర మూవీ గురించే చర్చ. భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ టికెట్ల అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన విషయం తెలుసు కదా. ఈ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ట్రైలర్ రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో అన్ని రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తోంది. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో రెండే నిమిషాల్లో టికెట్లన్నీ అమ్ముడైపోవడం గమనార్హం. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో అయితే తొలి రోజు మొత్తంగా 27 షోలు ఉన్నాయి.
ఉదయం 7.55 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మొత్తంగా 27 షోలు వేస్తుండం విశేషం. అయితే ఇన్ని షోలు ఉన్నా, టికెట్ల ధరలను భారీగా పెంచినా కూడా కేవలం రెండే నిమిషాల్లో ఈ టికెట్లన్నీ అమ్ముడైపోయాయంటే సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.“దేవర”కు తెలుగు, హిందీలతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ వారం పెద్దగా పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం. మరోవైపు వచ్చే వారం నుండి దసరా సెలవులు కావడంతో బాక్సాఫీస్ వద్ద “దేవర” దూకుడుకు అడ్డు అదుపు ఉండకపోవచ్చు. అయితే ఇప్పటి వరకు సినిమాపై అంచనాలు పీక్స్‌లోనే ఉండగా, ప్రీమియర్ షోస్ నుండి ఆ ఒక్కటి గనుక వస్తే, బాక్సాఫీస్ వద్ద దేవర సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయం.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అర్ధరాత్రి షోస్ కు అనుమతులు రావడంతో, అభిమానులు బెనిఫిట్ షోలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ షోస్ చూసిన వారు సినిమా గురించి పాజిటివ్ రివ్యూ ఇచ్చారా ఇక దేవర దూకుడికి బ్రేకులు ఉండవు. మరోవైపు ‘ఆయుధ పూజ’ పాట ఒక్కటే విడుదలకు మిగిలి ఉన్న ప్రమోషన్ మెటీరీయల్ కాగా, దీని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ స్టార్ హీరో సినిమా అయినా రోజుకు ఐదు షోలు ప్రదర్శించబడతాయి. కాని దేవరకు మిడ్ నైట్ షో కి 29 థియేటర్లకు అనుమతిచ్చింది తెలంగాణ సర్కారు.అంతే కాదు మొదటి రోజు దేవర ఆరు షో లు వేసుకోవచ్చని తెలిపింది.