Kajjikayalu : క‌జ్జికాయ‌ల‌ను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి..!

Kajjikayalu : మ‌నం పండ‌గ‌ల‌కు అనేక పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో కొన్నితీపి వంట‌కాలు కూడా ఉంటాయి. వాటిలో క‌జ్జికాయ‌లు కూడా ఒక‌టి. క‌జ్జికాయ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిని ఎవ‌రికి న‌చ్చిన రుచుల్లో వారు త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే ఈ క‌జ్జికాయ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోప‌ల స్వీట్ గా ఉండే ఈ క‌జ్జికాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ క‌జ్జికాయ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌జ్జికాయల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – పావుకిలో, వేడి నెయ్యి – 3టేబుల్ స్పూన్స్, ప‌ల్లీలు – ఒక క‌ప్పు, నువ్వులు – అర క‌ప్పు, ఎండుకొబ్బ‌రి పొడి – అర క‌ప్పు, పుట్నాల ప‌ప్పు – ఒక క‌ప్పు, బెల్లం త‌రుగు – పావుకిలో లేదా త‌గినంత‌, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Kajjikayalu recipe in telugu make in this method
Kajjikayalu

క‌జ్జికాయల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో నెయ్యి వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసుకుని పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత దీని మీద మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి చిన్న మంట‌పై చ‌క్క‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నువ్వులు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ప‌ల్లీల‌పై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసుకోవాలి. ఇందులోనే నువ్వులు, పుట్నాల ప‌ప్పు, బెల్లం తురుము, ఎండు కొబ్బ‌రి పొడి, యాల‌కుల పొడి వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ముందుగా క‌లిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ ప‌లుచటి రోటీలా వ‌త్తుకోవాలి. ఇప్పుడు కజ్జ‌కాయ‌లు వ‌త్తే చెక్క‌ను తీసుకుని దానికి నూనె రాయాలి.

త‌రువాత దీనిపై వ‌త్తుకున్న రోటిని వేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ప‌ల్లీల మిశ్ర‌మాన్ని ఉంచాలి. త‌రువాత అంచుల‌కు నీటితో త‌డి చేసి గ‌ట్టిగా వ‌త్తుకోవాలి. ఎక్కువ‌గా ఉండే పిండిని తీసేసి క‌జ్జికాయ‌ల‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌జ్జికాయ‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై లైట్ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే క‌జ్జికాయ‌లు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని గాలి, త‌డి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. పండ‌గ‌ల‌కే కాకుండా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చాలాసుల‌భంగా క‌జ్జికాయ‌లను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts