సాధారణంగా మనం భోజనంలో భాగంగా వివిధ రకాల చిప్స్ తినడం చేస్తుంటాము అయితే చాలా మంది పొటాటో చిప్స్ తినడానికి ఇష్ట పడుతుంటారు. అదే కాకరకాయ చిప్స్ అంటే చాలామందికి తినడానికి ఇష్టపడరు. కాకరకాయలు చేదుగా ఉంటాయని భావించి వాటిని దూరం పెడతారు.అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కాకరకాయ చిప్స్ ను చేదు లేకుండా ఇలా చేస్తే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. మరి కాకరకాయ చిప్స్ ఎలా చేయాలి ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
కాకరకాయలు అరకిలో, టేబుల్ స్పూన్ ఉప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, కారం తగినంత.
తయారీ విధానం
ముందుగా కాకరకాయలను రౌండ్ గా లేదా వేలి పొడుగు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కలకు ఉప్పును కలిపి ఒక గంట పాటు ఒక క్లాత్ లో గట్టిగా కట్టి వేయాలి. ఒక గంట తర్వాత ఈ కాకరకాయ ముక్కలను బాగా ఆరబెట్టాలి. కాకరకాయ ముక్కలు ఆరిన తరువాత స్టవ్ మీద నూనె పెట్టి నూనెను బాగా వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినా కాకరకాయలలోకి అవసరమైతే కాస్త ఉప్పు, తగినంత కారం కలుపుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ చిప్స్ తయారైనట్లే.