Kalyaan Dhev : గుట్టు చ‌ప్పుడు కాకుండా ఓటీటీలోకి వ‌చ్చేసిన చిరంజీవి చిన్న‌ల్లుడి సినిమా..!

Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ సినిమాల‌తోనూ బిజీగా ఉన్న విష‌యం విదిత‌మే. అయితే క‌ల్యాణ్ దేవ్ చివ‌రిసారిగా న‌టించిన చిత్రం.. సూప‌ర్ మ‌చ్చి.. ఇటీవ‌లే సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన‌ట్లే చాలా మందికి తెలియ‌దు. దీంతో సినిమా భాష‌లో చెప్పాలంటే.. ఈ మూవీ వాష్ అవుట్ అయింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ సినిమా తాజాగా గుట్టు చ‌ప్పుడు కాకుండా ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌స్తుతం ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.

Kalyaan Dhev latest movie Super Machi released on OTT
Kalyaan Dhev

సూప‌ర్ మ‌చ్చి సినిమాను యాక్షన్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. ఇందులో క‌ల్యాణ్ దేవ్‌, రచిత రామ్‌లు హీరో హీరోయిన్లుగా న‌టించారు. పులి వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ మూవీ విడుద‌ల స‌మ‌యంలో క‌ల్యాణ్ దేవ్ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో కూడా పాల్గొన‌లేదు. ఈయ‌న త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్లే సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌లేద‌ని అప్ప‌ట్లో అన్నారు.

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. రాజు (క‌ల్యాణ్ దేవ్‌) ఒక చిన్న బార్‌లో సింగ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. మీనాక్షి (ర‌చిత రామ్‌)తో అత‌నికి ప‌రిచ‌యం అవుతుంది. అయితే ఆమె అత‌న్ని చాలా తీవ్రంగా ప్రేమిస్తుంటుంది. కానీ అత‌ను ఆమెను ప‌ట్టించుకోడు. ఓ ద‌శ‌లో ఆమె అత‌నితో ప‌డుకోవ‌డానికి కూడా సిద్ధ‌మ‌వుతుంది. కానీ ఆమెను అత‌ను అవ‌మానించి పంపించేస్తాడు. అయితే ఆమె అత‌న్ని అంత‌లా ప్రేమించడానికి గ‌ల కార‌ణం ఏమిటి ? అత‌ను ఆమెకు ఎందుకంత‌లా న‌చ్చాడు ? చివ‌రికి ఏమ‌వుతుంది ? వ‌ంటి వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే. అయితే ఓపిక ఉన్నా ఈ మూవీని చూడ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌. ఫ‌ర్లేదు చూస్తాం అనుకుంటే మీ ఇష్టం. కానీ అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న తెలుగు సినిమాల జాబితాలో ఇదొక‌టిగా ఉంటుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎవ‌రూ చూసేందుకు అయితే ధైర్యం చేయ‌క‌పోవచ్చు..!

Editor

Recent Posts