Rose Petals : గులాబీ పువ్వుల‌ను ఇంట్లో ఇలా ఈ దిక్కున ఉంచండి.. మీకు వద్ద‌న్నా డ‌బ్బు వ‌స్తుంది..!

Rose Petals : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో వారు ఇబ్బందులు ప‌డుతున్నారు. కుటుంబ స‌మ‌స్య‌ల‌తోపాటు గొడ‌వ‌లు, వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాగే అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అయితే ఇందుకు ఇంట్లో వాస్తు దోషాలు, నెగెటివ్ ఎన‌ర్జీ కూడా కార‌ణ‌మ‌వుతాయి. ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ లేదా వాస్తు దోషాలు ఉంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తుంటాయి. ఎవ‌రైనా స‌రే చాలా స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతుంటే వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయ‌ని.. నెగెటివ్ ఎన‌ర్జీ ఉంద‌ని అర్థం చేసుకోవాలి. దీన్ని తొల‌గించుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌చ్చి అంతా మంచే జ‌రుగుతుంది. ఇక పాజిటివ్ ఎన‌ర్జీ వ‌చ్చేలా చేయ‌డంలో గులాబీ పువ్వులు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయని చెప్ప‌వ‌చ్చు.

గులాబీ పువ్వుల‌ను చూడ‌గానే స‌హ‌జంగానే ఎవ‌రికైనా మ‌న‌స్సుకు చాలా ఆహ్లాదం క‌లుగుతుంది. వాటిని స్త్రీలు త‌ల‌లో ధ‌రించేందుకు ఎంతో ఇష్ట‌ప‌డుతుంటారు. గులాబీ పువ్వుల్లో అనేక ర‌కాలు ఉంటాయి. అయితే ఎరుపు రంగులో ఉండే గులాబీ పువ్వులు ఎక్కువ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. క‌నుక ఎరుపు రంగు గులాబీ పువ్వుల‌నే తీసుకోవాలి. వీటిని తెంపి ప‌క్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గాజు పాత్ర తీసుకుని శుభ్రంగా క‌డిగి మంచినీళ్ల‌ను పోయాలి. అందులో గులాబీ పువ్వుల రెక్క‌ల‌ను తెంపి వేయాలి. నీరు క‌న‌ప‌డ‌కుండా ఉండేలా పాత్ర మొత్తం నీటిపై పువ్వుల‌ను విస్త‌రించాలి. త‌రువాత ఆ పాత్ర‌ను ఇంట్లో గాలి బాగా వ‌చ్చే చోట పెట్టాలి.

keep Rose Petals in your home in this way for wealth
Rose Petals

ఇంట్లో హాల్‌లో ఏదైనా టేబుల్ మీద లేదా కిటికీ వ‌ద్ద ఇలా గులాబీ పువ్వుల‌ను నింపిన గాజు పాత్ర‌ను ఉంచాలి. దీంతో బ‌య‌టి నుంచి వ‌చ్చే గాలికి ఆ గులాబీ పువ్వుల ప‌రిమ‌ళం తోడవుతుంది. ఇది ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ, వాస్తు దోషాలు మొత్తం పోతాయి. ఫ‌లితంగా పాజిటివ్ ఎన‌ర్జీ పెరిగి ఇంట్లో ఉండే వారికి అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. అనారోగ్య‌, ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది. అయితే ఇలా కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే కాదు.. రోజూ చేయాల్సి ఉంటుంది. ఏ రోజుకారోజు పాత్ర‌ను క‌డిగి అందులో మంచినీళ్ల‌ను పోసి మ‌ళ్లీ అందులో పైన చెప్పిన విధంగానే గులాబీ పువ్వుల‌ను వేయాలి. ఇలా రోజూ చేయాలి. దీంతో త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. ఇలా గులాబీ పువ్వుల‌తో ఇంట్లో పాటిజివ్ ఎన‌ర్జీని పెంచుకుని స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
D

Recent Posts