Vegetables : ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. ఫ్రిజ్‌ లేకుండానే కూరగాయలను నిల్వ చేసుకోవచ్చు..!

Vegetables : సాధారణంగా చాలా మంది వారం లేదా పది రోజులకు ఒకసారి మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, ఆకుకూరలు కొంటుంటారు. వాటిని తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫ్రిజ్‌లో పెట్టినా సరే అవి పాడవుతుంటాయి. కానీ కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు.. ఫ్రిజ్‌ అవసరం లేకుండానే కూరగాయలను ఎల్లప్పుడూ తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దోసకాయలు, ఆలుగడ్డలు, చిలగడదుంపలు, చామదుంపలు, ముల్లంగి, బీట్‌ రూట్‌ లాంటి వాటిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు. అవి బయటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో పెడితే తేమ కారణంగా అవి త్వరగా పాడయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక పొడిగా ఉండే చోట వీటిని పెడితే చాలా రోజుల వరకు తాజాగా నిల్వ ఉంటాయి. అలాగే కరివేపాకును తడి లేకుండా గాలి చొరబడని సీసాలో పెడితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. సీసాలో ముప్పావు భాగం నీళ్లు ఉండేలా నింపి క్యాబేజీని దాని మీద పెడితే తాజాగా ఉంటుంది. నీళ్లలో మునగకుండా చూడాలి.

keep your Vegetables fresh and store more days without fridge
Vegetables

దొండకాయలు పచ్చిగా ఉంటే ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు. పొడిగా ఉండే చోట పెడితే ఎన్ని రోజుల పాటు అయినా సరే నిల్వ ఉంటాయి. కానీ వీటిని పండ్ల వద్ద ఉంచరాదు. అలా పెడితే త్వరగా పండి పాడవుతాయి. టమాటాలు కాస్త దోరగా ఉన్నవి తీసుకుంటే ఎప్పటికప్పుడు పండుతుంటాయి. దీంతో ఇవి ఎక్కువ రోజుల పాటు ఉంటాయి. ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదు.

పాత్రలో నీళ్లు పోసి కొత్తిమీర కాడలను అందులో ఉంచాలి. దీంతో కొత్తిమీర తాజాగా ఉంటుంది. అలాగే క్యారెట్లను అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టి పైన కింద తెరిచి ఉంచితే నిల్వ ఉంటాయి. కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు ఎండినట్లు, వాడినట్లు ఉన్నవాటిని తీసుకోకూడదు. ఇవి త్వరగా పాడవుతాయి. తాజాగా ఉన్నవే కొనాలి. ఇక ఇంట్లో కూరగాయలను శుభ్రంగా ఉన్న చోట పొడి ప్రదేశంలో ఉంచాలి. అక్కడ ఎండ తగలకూడదు. అలాగే ఏ కూరగాయకు దాన్నే విడిగా వేరే వేరే కవర్లలో ఉంచాలి. ఇలా ఈ చిట్కాలను పాటించడం వల్ల కూరగాయలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. తాజాగా ఉంటాయి.

Share
Editor

Recent Posts