Kobbari Palli Laddu : కొబ్బ‌రి ప‌ల్లి ల‌డ్డూల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Kobbari Palli Laddu : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రితో చేసే ఈ తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌చ్చికొబ్బ‌రితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో కొబ్బ‌రి ప‌ల్లి లడ్డూలు కూడా ఒక‌టి. ప‌చ్చి కొబ్బ‌రి, ప‌ల్లీలు, నువ్వులు క‌లిపి చేసే ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. రుచితో పాటు చక్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ కొబ్బ‌రి ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి ప‌ల్లి ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ముప్పావు క‌ప్పు, నువ్వులు – పావు క‌ప్పు, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – 2 క‌ప్పులు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.

Kobbari Palli Laddu recipe in telugu very tasty and healthy
Kobbari Palli Laddu

కొబ్బ‌రి ప‌ల్లి ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్లారిన త‌రువాత పొట్టు తీసి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నువ్వులు కూడా వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పొట్టు తీసిన ప‌ల్లీలు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో బెల్లం తురుము. పావు క‌ప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వ‌ర‌కు వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దానిని వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో కొబ్బ‌రి తురుమును తీసుకోవాలి. ఇందులోనే వ‌డ‌క‌ట్టిన బెల్లం వేసి క‌ల‌పాలి. దీనిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌ల్లీలు వేసి క‌ల‌పాలి.

ఇందులోనే నెయ్యి కూడా వేసి ఉండ చేయ‌డానికి వ‌చ్చే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. కొబ్బరి మిశ్ర‌మాన్ని చేత్తో తీసుకుని ఉండ క‌ట్టి చూడాలి. ఈ మిశ్ర‌మం ఉండ చేయ‌డానికి రాగానే స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ మిశ్ర‌మాన్ని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి ప‌ల్లి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా ప‌చ్చి కొబ్బ‌రితో చేసిన ల‌డ్డూల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts